సాధారణంగా సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటే ఎవరైనా ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు..అవతలి వ్యక్తి బ్యాగ్ గ్రౌండ్ ఏంటో తెలియకుండానే గుడ్డిగా నమ్మించి డబ్బు సమర్పించుకుంటారు.  ఇండస్ట్రీలో తమకు పెద్ద వారు తెలుసునని సినిమాల్లో మంచి రోల్ ఇప్పిస్తానని కొంత మంది దళారులు యువతులకు మాయ మాటలు చెప్పి లైంగికంగా లోబర్చుకుంటారు.  ఇలా ఎంతో మంది యువతులు మోస పోయిన సంఘటనలు కోకొల్లలు.  ఆ మద్య నటి శ్రీరెడ్డి ఇదే అంశంపై సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..దాని వల్ల ఎంతో మంది అమ్మాయిలు సినీ ఛాన్స్ ల కోసం తమ ధన, మానాలు కోల్పోతున్నారని ఆరోపించి పెద్ద ఉద్యమమే తీసుకు వచ్చింది.  కానీ అనుకోని కారణాల వల్ల ఉద్యమాన్ని ఎంతో కాలం కొనసాగించలేక పోయింది శ్రీరెడ్డి. 
 
ఓ వైపు దేశ వ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం కొనసాగుతుంటే..తాజాగా ఓ వర్థమాన కన్నడ నటిని సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించి ఓ నటుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 'గుళిహట్టి' చిత్ర సహనటుడు కిరణ్ వాసుదేవ్ వర్ధమాన కన్నడ నటి జ్ఞానభారతికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు.  డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న కిరణ్ ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుసునని జ్ఞానభారతి ని నమ్మించాడు. డ్యాన్స్ నేర్చుకుంటే అవకాశాలు దగ్గరవుతాయని నమ్మించాడు.   కిరణ్ చెప్పినట్టుగా ఉళ్లాల ఉపనగర్ స్టూడియోకు తాను వెళ్లగా, అత్యాచారం చేశాడని ఆరోపించింది.

ఈ విషయం ఎవరికైనా చెబితే, ఫేస్ బుక్ లో పరువు తీస్తానని బెదిరించాడని తెలిపింది.  భయంతో ఎవరికీ చెప్పకుండా తాను ప్రశాంతంగా ఉన్నానని తనకు మరో యువకుడితో నిశ్చితార్థం కాగా, ఆ విషయం తెలుసుకుని  తిరిగి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడని తన మాట వినకుంటే ఫేస్ బుక్ లో తన గురించి చెడుగా ప్రచారం చేస్తానని బెదిరించాడని పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం కిరణ్ మహదేవ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: