నాగార్జున ఎప్పుడు టాలీవుడ్ టాప్ 4 లో కొనసాగుతూ స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు . అయితే తన కొడుకులిద్దరూ ఘోరంగా విఫలమయ్యారు . తీసిన అన్ని సినిమాలు బోల్తా పడుతున్నాయి. దీనితో నాగార్జున కు కలవరం మొదలైంది. నాగ చైతన్య చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలో అడుగు పెట్టినా ఇంకా సరైన ట్రాకులో పడలేదనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. చైతూ కెరీర్లో ‘ఏమాయ చేశావే', ‘మనం' లాంటి హిట్స్‌తో పాటు మరికొన్ని విజయాలు ఉన్నప్పటికీ అవి అతడిని స్టార్ హీరోల జాబితాలో చేర్చలేక పోయాయి అనేది వాస్తవం. 

అఖిల్ లాచింగ్ తడబాటు

నాగ చైతన్య బ్లాక్ బస్టర్ రుచి చూసి చాలా కాలమైంది. ఇటీవల విడుదలైన సవ్యసాచి బాక్సాఫీసు వద్ద నిరుత్సాహ పరచగా, అంతకు ముందు విడుదలైన సినిమాలు కొన్ని మాత్రమే ఓ మోస్తరుగా ఆడాయి. నాగార్జున రెండో కుమారుడు ‘అఖిల్' తెరంగ్రేటం కూడా సరిగా జరుగలేదు. తొలి సినిమా దారుణమైన ప్లాప్ కాగా.... ‘హలో' సినిమా ద్వారా రీ లాంచ్ చేశారు. ఈ సినిమా హిట్ జాబితాలో పడినప్పటికీ అఖిల్‌కు రావాల్సినంత క్రేజ్ తేవడంలో విఫలమైంది. 

సెట్ చేసేందుకు మన్మధుడి ప్రయత్నాలు

ఈ పరిణామాలను లైట్ తీస్కుంటే భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డ మన్మధుడు ఇద్దరు కుమారుల కెరీర్ సెట్ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. స్క్రిప్టు ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వాటిని తనకు చూపించే వరకు ఫైనలైజ్ చేయవద్దని ఇద్దరు కుమారులకు నాగార్జున సూచించారట. సినిమా రిలీజ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఫైనల్ ఔట్ పుట్ సంతృప్తికరంగా ఉంటేనే విడుదల చేయాలని, అవసరం అయితే రీషూట్లు, మార్పులకు వెనకాడకూడదని, ఈ విషయాల్లో కఠినంగా లేక పోతే కెరీర్ మీద ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని సూచించాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: