తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సాటి, పోటీ ఎవరూ లేరని మరో మారు నిరూపించారు. ఆయన నటించిన 2 ఓ మూవీ ఈ రోజు విడుదలై సంచలనం స్రుష్టిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన రోబోకు ఇది సీక్వెల్. ర‌జ‌నీకాంత్ నాలుగు షేడ్స్‌.. వ‌శీక‌ర‌ణ్‌.. చిట్టి, వెర్ష‌న్ 2.0(బ్యాడ్ చిట్టి)..తో పాటు యూనిట్ దాచిన సీక్రెట్ ఏంటంటే వెర్ష‌న్ 3.0లోని మ‌రుగుజ్జు చిట్టి వెర్ష‌న్ 3.0 పాత్ర‌ల్లో ర‌జ‌నీకాంత్ చ‌క్క‌గా న‌టించారు. ఈ ఏజ్ లో కూడా రజనీ మేకప్ కష్టపడి చేసిన నటన చూస్తే సూపర్ స్టార్ అంటే ఆయనే అనిపించక మానదు.


ఈ మూవీకి మరో విశేషం ఏంటంటే దీన్ని ఇప్పటివరకూ దేశంలో ఏ చిత్రానికి పెట్టనంత ఖర్చుతో అంటే 550 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇందుకు గానూ ఆ చిత్ర నిర్మాతలను అభినందించితీరాలి. ఇక ఈ సినిమాకు ఏకంగా అయిదేళ్ళా పాటు డైరెక్టర్ శంకర్ కష్టపడ్డారు. ఆయన విజన్ కి లభించిన అరుదైన గౌరవం ఈ చిత్ర విజయంగా చెప్పుకోవాలి. 


మన దేశంలో కూడా హాలీవుడ్ రేంజి డైరెక్టర్లు ఉన్నారని చెప్పడానికి నిదర్శనం శంకర్. ఆయన ఓ మంచి మెసేజ్ తో రాసుకున్న కధను అంథే అద్భుతంగా ఎక్కడ తొట్రుపాటు లేకుండా తెరకు ఎక్కించడం నిజంగా గ్రేట్. ఓ మ‌నిషి ఓరా నెగ‌టివ్ ఎన‌ర్జీగా ఎలా మారుతుంద‌నే అంశాన్ని శంక‌ర్ లాజిక‌ల్‌గా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ఆ ప‌వ‌ర్‌ను న్యూట్ర‌లైజ్ చేయ‌డం.. చివ‌ర‌కు అది త‌ప్పించుకుని బ‌య‌ట‌కు రాగానే.. చిట్టి వెర్ష‌న్ 2.0 దాంతో స్టేడియంలో చేసే ఫైట్ అంతా బావుంది. ఇలాంటి సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ అభినంద‌నీయుడు


ఇంకా  ఈ మూవీలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర ఉంది. అదే అక్షయకుమార్ ది. నిజానికి ఈ మూవీలో ఎక్కువ కష్టం ఆయనదే. ర‌జ‌నీకాంత్ కంటే అక్ష‌య్‌కుమార్‌కే ఎక్కువ క‌ష్టం విషయంలో ఎక్కువ మార్కులు వేయాలి.  ఎందుకంటే అత‌ను వేసుకున్న మేక‌ప్ ఆసాధారణంగా ఉంటుంది. అక్ష‌య్‌కుమార్ ఆంత్రాలజీ  ప్రొఫెస‌ర్‌గా.. చివ‌ర‌కు నెగ‌టివ్ ఎనర్జీ ఉన్న ప‌క్షిరాజుగా మెప్పించాడు.  మొత్తంగా చూసుకుంటే ట్విస్టులు ఏవీ లేకపోవచ్చు కానీ ఈ మూవీ పూర్తిగా మరో ప్రపంచాన్ని ఆవిష్కరించిందని గట్టిగా చెప్పవచ్చు. ఇది మన భారతీయ మూవీ అని గర్వంగా చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: