ఎన్నో అంచనాల నడుమున రిలీజ్ అయినా రోబో 2.0 ప్రేక్షకలను మెప్పించిందని చెప్పాలి . నాలుగేళ్లు శంకర్ పడిన కష్టం వెండి తెర మీద కనిపిస్తుంది. అయితే  సూపర్‌ హీరో వర్సెస్‌ జయంట్‌ ఫోర్స్‌ అనేది హాలీవుడ్‌ సినిమాని ఏళ్ల తరబడి నడిపిస్తోన్న ఇంధనం. ఇకపై అలాంటి సినిమాలని మన వాళ్లు కూడా 'ఊహించవచ్చు', ప్రయత్నిస్తే 'సాధించవచ్చు' అని నిరూపిస్తుంది 2.0, ఏ శంకర్‌ ఫిలిం! ఓపెనింగ్‌ టైటిల్స్‌ దగ్గర్నుంచే శంకర్‌ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడు.

Image result for robo 2.0

3డి టెక్నాలజీలో హాలీవుడ్‌ సినిమాలు తరచుగా చూస్తూనే వుంటాం కానీ అది ఇంత బ్యూటిఫుల్‌గా వుంటుందా అనిపించేట్టుగా టైటిల్‌ డిజైనింగ్‌ దగ్గరే శంకర్‌ సృజనకి సరెండర్‌ అయిపోతాం. పాటలు తీయడంలో అందె వేసిన చెయ్యి అయినా కానీ ఈసారి శంకర్‌ ఒకే పాట చిత్రీకరించి, అది కూడా కథకి అడ్డం పడకుండా చివర్లో టైటిల్స్‌కి పరిమితం చేసాడు. శంకర్‌ ఊహాశక్తికి, దానిని తెర మీదకి తెచ్చిన ప్రతిభకి మాత్రం హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Image result for robo 2.0

తనకి తానే ఒక స్టాండర్డ్‌ సెట్‌ చేసుకుని నిరంతరం దానిని ఇంకాస్త పెంచుకునే శంకర్‌ 2.0తో ఫిలింమేకర్‌ ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేసారనడంలో సందేహం లేదు. సాంకేతికంగా ఉన్నతంగా రూపొందిన ఈ చిత్రానికి ఇంత పెట్టుబడి ఏమాత్రం వెనుకాడకుండా పెట్టిన నిర్మాతలు అభినందనీయులు. ఎంత విజువల్‌ స్పెక్టకిల్‌ అయినా కానీ ఎమోషనల్‌గా కనక్ట్‌ చేసే స్టోరీపై కూడా అంతే ఫోకస్‌ వుంటే ఈ హాలీవుడ్‌ డ్రీమ్‌కి ఇండియన్‌ హార్ట్‌ కూడా జత చేసినట్టుండేది. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త అసంతృప్తి వుంటుందేమో కానీ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ విషయంలో లోటు చేయదని గ్యారెంటీ. కొన్ని అపశ్రుతులు మినహాయిస్తే... వెండితెరపై, అది కూడా త్రీడీలో చూస్తే కానీ తనివి తీరనంతగా 'బిగ్‌ స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌'కి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌గా 2.0 నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: