బాహుబలి 2 సినిమానే టార్గెట్ గా చేసుకుని రంగం లోకి దిగిన 2.0 సినిమా ప్రీమియర్ ల దగ్గర బాహుబలి 2 ని కొట్టలేకపోయింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన '2.0' ఈరోజే విడుదలయింది.

Image result for 2.0 vs baahubali2


2.0 క్రేజ్ భారీగా ఉందని నార్త్ అమెరికాలో సినిమాను 800 స్క్రీన్స్ లో విడుదల చేశారు.  ఈ సినిమాకు ఇండియాలో స్పందన భారీగానే ఉన్నా యూఎస్ లో ప్రీమియర్స్ విషయంలో మాత్రం ఆశించినంత రెస్పాన్స్ దక్కలేదని వార్తలు వస్తున్నాయి.

Image result for 2.0 vs baahubali2


అదే కారణం తో ఈ సినిమా ప్రీమియర్ కలక్షన్ ల వివరాలు అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్రైమ్ మీడియా బయటకి చెప్పలేదు అంటున్నారు. సహజంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ట్రేడ్ విశ్లేషకులు రెన్ ట్రాక్ నుండి కలెక్షన్స్ ఫిగర్స్ తీసుకుని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తారు.
Image result for 2.0

కానీ ఇప్పటి వరకూ ఎవ్వరూ విడుదల చెయ్యకపోవడం ఆశ్చర్యంగా ఉంది. బాహుబలికి యూఎస్ ప్రీమియర్స్ ద్వారా $3.5 మిలియన్స్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు '2.0' ఆ మార్క్ టచ్ చేయలేదని అంటున్నారు. ముప్పై డాలర్ల ధర ఉండడం కూడా ఈ సినిమా బాహుబలి 2 రికార్డులు కొట్టలేక పోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: