బాలీవుడ్ వారు ప్రతి విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసి నాలుగు గోడల మధ్య లో జరిగే తతంగాన్ని కూడా సిగ్గు లేకుండా ట్విట్టర్ లో పెడుతున్నారు. అయితే ఇక ప్రేమ వ్యవహారాలకు వస్తే.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ అఫైర్ ఇప్పుడు బజారున పడింది. అర్జున్ రాంపాల్ అర్ధనగ్న ఫొటోను ప్రియురాలు గ్యాబ్రిల్లా డీమిట్రియాడెస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వారి అఫైర్ చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే. పడక గదిలో అర్జున్ రాంపాల్ అర్ధనగ్నంగా పడుకొన్న ఫొటోను ప్రియురాలు గ్యాబ్రిల్లా పోస్ట్ చేసింది. ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు అని క్యాప్షన్ పెట్టింది.

 గ్యాబ్రిల్లా పోస్టుపై నెటిజన్లు కామెంట్లు

దాంతో నెటిజన్లు గ్యాబ్రిల్లాను కామెంట్లతో ఆడుకొన్నారు. 50, 52 ఏళ్లు వచ్చేసరికి ఇలాంటి నలుపుడే ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గ్యాబ్రిల్లా పోస్ట్ చేసిన అర్జున్ రాంపాల్ ఫొటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇది రిలేషన్‌షిప్ అలర్ట్ అని ఒకరు కామెంట్ చేశారు. నీవు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో మాకు తెలిసిపోయింది మరొకరు ట్వీట్ చేశారు. నా పక్కన అందమైన యువతి ఉన్నాడనే ఫీలింగ్‌తో అతడు నిద్ర పోతున్నాడు. అర్జున్ రాంపాల్ జాక్‌పాట్ కొట్టేశాడు అంటూ కామెంట్లు విసురుతున్నారు. 

Image result for arjun rampal

కొద్ది నెలల క్రితం అర్జున్ రాంపాల్ తన భార్య నుంచి అధికారికంగా విడాకులు పొందాడు. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి గ్యాబ్రిల్లాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వీరిద్దరి హడావిడి చూసి బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. కాగా, హృతిక్ రోషన్ భార్య సుజానే ఖాన్‌తో అర్జున్ రాంపాల్‌కు రిలేషన్ షిప్ ఉందే మాట బాలీవుడ్ మీడియాలో బలంగా పేర్కొంటారు. అర్జున్ రాంపాల్ కారణంగానే హృతిక్ దంపతులు విడిపోయారని చెప్పుకొంటారు. ఆ కారణంగానే అర్జున్ రాంపాల్ భార్య కూడా విడిపోయిందనే మాట బాలీవుడ్‌లో తరచూ వినిపిస్తుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: