సూపర్ స్టార్ ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో లో వచ్చిన ‘రోబో’సినిమా సీక్వెల్ గా రూపొందిన ‘2.0’సినిమా నవంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 10,500 స్క్రీన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి భారీ అంచనాలు నెలకొల్పింది.  మొద‌టి నాలుగు రోజులు అడ్వాన్స్ బుకింగ్ మొత్తం పూర్తైంది. మూవీకి పాజిటివ్ టాక్ రావ‌డంతో ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి.
హిందీలో దుమారమే
మొదటి రోజు కంటే రెండో రోజున హిందీ వెర్షన్ వసూళ్లు పుంజుకున్నట్టుగా తెలుస్తోంది. అన్ని ఏరియాలలో మంచి వసూళ్లే వచ్చాయి కానీ తమిళనాడులో మాత్రం ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఈ సినిమాకి వెచ్చించిన బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ వసూళ్లు ఆశాజనకంగా లేవని చెప్పొచ్చు.    రెండవ రోజు మాత్రం 2.0 అద్భుతంగా పుంజుకుంది అని చెప్పొచ్చు. చెన్నై నగరానికి సంబంధించినంత వరకూ తొలి రోజు వసూళ్ల విషయంలో 'సర్కార్'ను వెనక్కి నెట్టిన ఈ సినిమా, తమిళనాడు మొత్తంగా చూస్తే 'సర్కార్' రికార్డుకి దూరంగా వుండిపోయిందని చెబుతున్నారు.
Image result for sarkar movie
తమిళనాడులో 'సర్కార్' రెండు రోజుల్లోనే 50 కోట్లను రాబట్టింది. '2.ఓ' మాత్రం రెండు రోజుల్లో 30 కోట్ల లోపే వసూలు చేసింది.  వాస్తవానికి ‘సర్కార్’మొదటి నుంచి వివాదాలతో రిలీజ్ అయిన మూవీ..కానీ వసూళ్ల పరంగా దుమ్మురేపుతూ వచ్చింది.  'సర్కార్' సినిమాకి దీపావళి సెలవులు కలిసి వచ్చిన కారణంగానే ఆ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని అంటున్నారు. 
Related image
చాలా మంది 3డీ ఫార్మాట్ లోనే చూడాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తుండటం కూడా '2.ఓ' వసూళ్లపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.   ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు. ఇంకా రెండు రోజుల పటు వీకెండ్ ఉండడంతో వసూళ్లు స్టడీగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి 370 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: