అక్కినేని కుటుంబానికి  రొమాంటిక్  ఇమేజ్ ఉంది. వారసులు సైతం దాన్ని నిలబెడుతున్నారు. సీనియర్ అక్కినేని నటించిన 250 సినిమాల్లో అధిక భాగం ఇవే కావడం విశేషమైతే, ఆయన వారసుడు నాగార్జున కెరీర్లో సైతం ది బెస్ట్ అన్న మూవీస్ రొమాంటిక్ టచ్  తో ఉన్నవే ఉంటాయి. ఇపుడు అదే బాటలో మరో మారు నాగ్ తన ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. మన్మధుడు నాగ్ గా ట్యాగ్ తగిలించుకున్న ఆయన  ఇపుడు అదే ట్యాగ్ ని మరో మారు ముందుకు తెస్తున్నారు. వస్తున్నారు.


కింగ్ నాగార్జున ప్రస్తుతం మరో రెండు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు. దాంట్లో ఒకటి హిందీలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ కాగా మరొకటి ధనుష్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం. ఇక నాగ్ తెలుగులో ఇంత వరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ తన కొత్త చిత్రంలో నటించనున్నాడట. సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’ కి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ అనే టైటిల్ తో ఈచిత్రం తెరకెక్కనుందట. జనవరి లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


అప్పట్లో మన్మధుడు గా నాగ్ చేసిన మూవీ ఎంతటి  సెన్సేషనల్ హిట్ అన్నది తెలిసిందే. ఈ మూవీ ద్వారా నాగ్  పది కాలాలకు సరిపడా ఇమేజ్ ని సొంతం చెసుకున్నారు. అదో బిరుదులా కూడా నాగ్ కి సెట్ అయిపోయింది. ఇపుడు ఆ సెంటిమెంట్ తో నాగ్ మన్మధుడు 2 తో మళ్ళీ ఆడియన్స్ ని పలకరించనున్నాడు. అన్నీ కుదిరితే తొందరలో ఈ మూవీ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: