టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  మహేష్ కెరీర్ లో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా ‘భరత్ అనే నేను’. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మహేష్ ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు టాక్.  మిలినియర్ గా ఉన్న మహేష్ తన స్నేహితుడి కోసం గ్రామంలో రైతుల కోసం పోరాడే యువకుడిగా కనిపించబోతున్నాడట. 
Image result for srimanthudu
ఇక కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకున్న యువకుడిగా కనిపిస్తాడు మహేష్ బాబు.  రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మహేష్ బాబు  గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం, నల్గొండ జిల్లాలోని సిద్ధాపురం గ్రామాలను దత్త తీసుకున్న విషయం తెలిసిందే.  విద్య‌, వైద్యం అంద‌రికి అందేలా త‌న‌వంతు బాధ్య‌త‌గా కృషి చేస్తున్నారు.  తాజాగా ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్‌ ఫౌండేషన్‌తో క‌లిసి 150 మంది చిన్నారులకి విజ‌య‌వంతంగా గుండె చికిత్స‌లు చేయించారు. ఈ విష‌యాన్ని మ‌హేష్ భార్య న‌మ‌త్ర త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది.
Image result for mahesh babu family
చిన్నారుల గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సహకరించిన యూకే వైద్య బృందానికి ధన్యవాదాలు అంటూ నమ్రత తన ట్విట్టర్ లో పేర్కొంది. మహేష్ బాబు హీరోగానే కాకుండా వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టారు.  నేడు మహేష్ బాబు కి సంబంధించిన మల్టీప్లెక్స్ కూడా ప్రారంభం అయ్యింది.  ఇందులో ఏడు స్క్రీన్స్ అందుబాటులో ఉండ‌నున్నాయి.ఈ సందర్భంగా చిన్నారుల కుటుంబాలతో పాటు ఉన్న వైద్య బృందం ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: