దీపికా పదుకొనె బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే  టెన్నిస్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయికి ఎదిగిన దీపిక అటుపై కెరీర్ పరంగా యూటర్న్ తిరిగి కింగ్ ఫిషర్ మోడల్ గా .. బాలీవుడ్ కథానాయికగా ఎదిగిన తీరు ఆసక్తికరం. కెరీర్ జర్నీలోనే ప్రేమ ముగ్గులోకి దిగి - చివరికి తాను కోరుకున్నవాడినే పెళ్లాడి.. మొత్తానికి ఓ చరిత్రకే కారణమైంది.


ఈ మొత్తం జర్నీ ఎంత ఆసక్తిగా సాగిందో ఈ జర్నీ ఆద్యంతం యువహీరోలతో ఎఫైర్ల విషయంలోనూ అంతే ఆసక్తికర చర్చ సాగింది. అంతకుమించి దీపిక డేరింగ్ ఫోటోషూట్ల పైనా వాడి వేడిగా చర్చ సాగింది. ఎన్నో జాతీయ - అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీలకు దీపిక ఫోజులిచ్చింది. ఇప్పుడు మరో ఫోటోషూట్ అంతే వేడెక్కిస్తోంది. ఓవైపు పెళ్లి కూతురుగా సిగ్గుల మొగ్గలవుతూనే - మరోవైపు తన మోడలింగ్ అసైన్ మెంట్స్ ని పూర్తి చేసిన దీపిక .. ఇక పెళ్లి తర్వాత హనీమూన్ కానిచ్చేసి - పూర్తిగా కెరీర్ పరంగా బిజీ అవ్వబోతోంది. 

Image result for deepika padukone

తాజాగా ప్రఖ్యాత జీక్యూ ఇండియా మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొని హీట్ పెంచింది. దీపిక ఫియర్ లెస్ ఫ్యాబ్యులెస్ అంటూ కవర్ శీర్షికను ప్రచురించింది సదరు మ్యాగజైన్. ఈ కవర్ షూట్ కోసం నవవధువు.. కొత్త పెళ్లికూతురు చాలానే శ్రమించిందని ఆ ఫోటోలు చెబుతున్నాయి. డిప్స్ నెవ్వర్ బిఫోర్ అన్నంత హాట్గానూ ఈ కవర్ పేజీ షూట్ లో కనిపిస్తోంది. ఈ ఫోటోషూట్ లో బికినీలోనూ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: