టాలీవుడ్లో మెరుపు తీగ తమన్నా. ఆమె ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఒకటి రెండు తప్ప తన నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్ర ఓక్టీ పడలేదని అంటోంది. ఇపుడు ఆ లోటు నెక్స్ట్ ఏంటీ మూవీతో తీరిపోతుందని అంటోంది. ఇందులో తన ఏజ్ కి తగ్గ క్యారక్టర్ చేశానని తమ్మూ చెబుతోంది. అర్బన్ యూత్ ని టార్గెట్ చేసి తీసిన ఈ మూవీని ఎంజాయ్ చేస్తూ తమ్మూ చేసిందట. ఈ నెల 7వ్ ధియేటర్ల ముందుకు వస్తున్న ఈ మూవీ పై తమ్మూ బోలెడు ఆశలే పెట్టుకుంది.


హైదరాబాద్ లో జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ -అర్బన్ బ్యాక్ డ్రాప్ సినిమా నెక్ట్స్ ఏంటి? నా ఏజ్కు తగినట్లు.. సిటీ కల్చర్ ను ఎలివేట్ చేసే పాత్రలో నటించాను. ఇది నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే పాత్ర. ఇలాంటి పాత్ర చేయలేదే అనుకుంటున్న టైమ్ లో బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కొహ్లి ఈ కథతో నన్ను కలిశారు. నాకు బాగా నచ్చిన కథ ఇది.. కథ పరంగా పరిశీలిస్తే.. లండన్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. యూత్ ఫుల్ గా ఉంటుంది. నేటితరం ఆలోచనలను ప్రతిబింబిస్తుంది.


 అలాగే నేటి తరం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారనేది కూడా ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు. వస్త్రధారణ - కనిపించే విధానాన్ని బట్టి అమ్మాయిలను అంచనా వేయకూడదని - వారి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకునే హక్కు ఉంటుందని తెరపై చూపించారు అని తమ్మూ తెలిపింది.


 తనకు నచ్చిన అబ్బాయిని అమ్మాయి ఫేస్ చేసినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఈ సినిమాలో చూపించారు. ప్రేమ - సెక్స్ అనేవి సాధారణ విషయాలు. వాటి గురించి బోల్డ్ గా మాట్లాడే యువతిగా కనిపిస్తానని వెల్లడించింది. మొత్తానికి చూసుకుంటే తమ్మూ కి ఈ మూవీ మరో హిట్ ఇస్తుందని బాగా కాంఫిడెన్స్ గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: