హ.. హ.. హాసిని గుర్తుంది కదా.. అంత త్వరగా మర్చిపోయే క్యారక్టరా అది. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ తో పాటుగా సూపర్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుని గెలిచింది జెనిలియా. ఆ సినిమాలో ఆమె నటనకు ఫిదా అవ్వనివారుండరంటే నమ్మాల్సిందే. రితేష్ దేష్ ముఖ్ తో పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది జెనిలియా.


రితేష్ తో ప్రేమ పెళ్లి చేసుకున్న జెనిలియా ఇన్నాళ్లు తన ఫ్యామిలీ లైఫ్ నే చూసుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు అమ్మడికి మళ్లీ సినిమా గాలి వీచినట్టు ఉంది. అందుకే రీ ఎంట్రీకి రెడీ అయ్యిందని అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో జెనిలియాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆమె పెళ్లి చేసుకుంది.


ఇక ఆమె రీ ఎంట్రీ ఇవ్వడం అంటే హాసిని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అన్నట్టే. అయితే రీ ఎంట్రీలో హీరోయిన్ గా నటిస్తుందా లేదా అన్నదే డౌట్. హీరోయిన్ గా ప్రేక్షక హృదయాలను గెలిచిన జెనిలియా క్యారక్టర్ ఆర్టిస్టుగా చేయడం అంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లేదా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో వచ్చే సినిమాలను చేస్తే బెటర్ అంటున్నారు.


కమర్షియల్ సినిమా హీరోయిన్ గా మాత్రం జెనిలియా నటించడం కష్టమే అని తెలుస్తుంది. పెళ్లికి ముందు కూడా గ్లామర్ షోకి దూరంగా ఉన్న ఈ అమ్మడు రీ ఎంట్రీలో కూడా తనకు నచ్చిన పాత్రలనే చేస్తుందని అంటున్నారు. తెర మీద జెనిలియాని చూడాలనుకునే వారికి ఇదో శుభవార్తే అయినా హీరోయిన్ గా కాకుండా అక్క, వదిన పాత్రలు చేస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: