అందాల నాయిక కాజల్ చందమామలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరస హిట్లతో దూసుకుపోయింది. టాప్ స్టార్లూ, సూపర్ స్టార్ల పక్కన నటించిన కాజల్ తెలుగులో శ్రీదేవి రికార్డు ని కూడా తిరగరాసింది. తండ్రీ కొడుకుల పక్కన నటించి ఈ తరంలో తనకు ఎదురులేదనిపించుకుంది. ఈ ఏడాది మొదట్లో కొంత వెనకబడినా మళ్ళీ రెడీ అంటూ దూసుకువస్తోంది. ఏకంగా భారతీయుడు 2 లో  కమల్ పక్కన శంకర్ డైరెక్షన్లో ఆమె చాన్స్ కొట్టేసి సూపర్ అనిపించేసుకుంది. కవచం మూవీతో టాలీవుడ్లో యూత్ ఫుల్ హీరోల పక్కన కూడా వెలిగిపోవాలనుకుంటున్న కాజల్ ఇపుడు ఫుల్ బిజీ అర్టిస్ట్.


అయితే కాజల్ ఈ ఏడాది మొదట్లో మూవీస్ ఫట్ మనడం, హేల్త్ కూడా బాగులేకపోవడంతో ఇక కెరీర్ ని పక్కన పెట్టేయాలనుకుందట. ఓ దశలో పెళ్ళి కూడా చేసుకుని సెటిల్ అయిపోవాల‌ని కూడా డిసైడ్ అయిందట. అయితే మళ్లీ అవకాశాలు తలుపు తట్టడంతో ఆమె తన మనసుకు కూడా మార్చుకుందట. వచ్చే ఏడాది కూడా డైరీ ఫుల్ అయిపోయిన కాజల్  ఇపుడు కెరీరే ఇంపార్టెంట్ అంటోంది.


పెళ్ళి చేసుకుందామని నాకూ ఉంది. కానీ అందుకు తీరిక లేదే అంటూ ఈ ముద్దు గుమ్మ తెగ ఫీల్ అవుతోంది. చెల్లెలు నిషా అగర్వాల్ నాలుగేళ్ళ క్రితమే పెళ్ళి చేసుకుని ఎంచక్కా పండంటి బాబుకు తల్లి అయిపోయింది ఆ విధంగా కాజల్ కి పెద్దమ్మ ప్రమోషన్ కూడా వచ్చేసింది కానీ పెళ్ళి పీటలు మాత్రం ఎక్కే ముహూర్తం మాత్రం రావడంలేదు.


మూడు పదులు వయసు దాటిన ఈ అమ్మడు పెళ్ళి కోసం ఓ వైపు కలవరిస్తూనే అవకాశాలు మళ్లీ రావు కదా అనుకుంటూ మూవీస్ కి సైన్ చేసేస్తోంది మొత్తానికి కాజల్ పెళ్ళికి ఇప్పటికైతే ఫుల్ స్టాప్ పెట్టేసింది కాబట్టి వెండి తెరపై ఈ చందమామను మరి కొంతకాలం ఆమె ఫ్యాన్స్ చూసి తరించొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: