ఈ మద్య సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా బయోపిక్ సినిమాలకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఒకప్పుడు సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో మంచి గుర్తిపు పొందిన వారి జీవిత కథ ఆధారంగా బయోపిక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.  ఆ మద్య నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మాలీవుడ్ నటి కీర్తి సురేష్ కథానాయికగా ‘మహానటి’సినిమా తీశారు.  ఈ సినిమా అనుకున్నదానికన్నా ఎక్కువ సక్సెస్ కావడమే కాదు కలెక్షన్లు కూడా రాబట్టింది. 

Image result for NTR BIOPIC

ప్రస్తుతం క్రిష్-బాలకృష్ణ కాంబినేషన్ లో మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా తీస్తున్నారు.  ఈ సినిమా జనవరిలో రెండు భాగాలు రిలీజ్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.  అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంతో పేరు సంపాదించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తీస్తున్నారు. 

Image result for YATRA MOVIE

మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితంపై,కత్తి కాంతారావు ఇలా పలువురి బయోపిక్ లు వస్తున్నాయి.  ప్రస్తుతం తమిళంలో జయలలిత బయోపిక్ కి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం చాలామంది కథానాయికల పేర్లను పరిశీలించారు. చివరికి ఆ అవకాశం నిత్యామీనన్ కి దక్కింది. 

Related image

నిత్యామీనన్ కూడా జయలలితకు కాస్త దగ్గర పోలిక ఉండటంతో ఆమెనే ఎంచుకున్నారు దర్శక, నిర్మాతలు.  'ది ఐరన్ లేడీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి, తాజాగా నిత్యామీనన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు.  తమిళ నాట అమ్మకు ఎంతో ప్రాధాన్యత ఉంది..నటిగానే కాకుండా ఆమె రాజకీయంగా తమిళనాట చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: