సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవి మంచి విజయం అందుకుంది.  ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది.  బాలీవుడ్ లో ఏకంగా రూ.120 కోట్లు కొల్లగొట్టింది.  తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి కలెక్షన్లతో దూసుకు వెళ్తుంది.  సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం '2.0' థియేటర్లలో ఉండగానే తనే నెక్స్ట్ ఫిలిం 'పెట్టా' హంగామా మొదలైంది. ఈ సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ఈ మధ్యనే  'మరణ మాస్' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.   

తాజాగా ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. విలక్షణమైన పాత్రలను పోషిస్తున్న విజయ్ సేతుపతి, ఇతర స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను సైతం చేస్తున్నాడు. ప్రస్తుతం 'సైరా' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తోన్న ఆయన, రజనీకాంత్ 'పెట్టా'లోను ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి 'జితు' అనే క్యారెక్టర్ లో కనిపిస్తాడని వెల్లడించారు. ఈ ఫస్ట్ లుక్ లో సేతుపతి ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు.  చేతిలో గన్ పట్టుకొని వికట్టహాసంగా నవ్వుతున్నాడు. పైన ఒక శాలువా.. మొహంపైన గాయాలు.. ఆ నవ్వు చూస్తుంటే మాత్రం విజయ్ ఒక గ్యాంగ్ స్టార్ పాత్ర పోషిస్తున్నాడనిపిస్తోంది. 

 ఇక పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో రజనీకాంత్ స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు.   కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పేటా సినిమాలో ర‌జ‌నీకాంత్‌, నవాజుద్దిన్ సిద్దిఖీ , సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘మరణ మాస్’ అంటూ సాగిన ఈ పాటకు తమిళ రాక్ స్టార్ అనురుధ్ అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు.  తమిళ వెర్షన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. తెలుగు 'పెట్టా' కొంచెం ఆలస్యంగా రిలీజ్ అవుతుందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: