ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ లిస్టు వస్తోందంటే అందరూ ఆసక్తిగా చూస్తారు.  ఎవరు ఏ స్థానంలో ఉంటారూ..ఎవరి ఆదాయం ఎంతెంత అనే వివరాలు ఇందులో పొందుపరుస్తారు.  తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఆదాయం విషయంలో టాప్—100 సెలబ్రెటీల లిస్టు విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్ నుంచి నంబర్ వన్ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలవడం విశేషం.  ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాన్  ఫోర్బ్స్ లిస్టు నెంబర్ వన్ గా ఉండటం మెగా ఫ్యాన్స్ హ్యాపీ న్యూస్ గా మారింది. 

Image result for salman khan

ఇక మన టాలీవుడ్ లో చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు.  , ఆ తరువాతి స్థానాల్లో ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, అల్లు అర్జున్, కొరటాల శివ వంటి సెలబ్రిటీలు నిలిచారు.  ఇక అత్యంత సంపాదన పరులైన భారతీయ సెలబ్రిటీల లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఏడాదికి సల్మాన్ సంపాదన రూ.253 కోట్లు అని ఫోర్బ్స్ పేర్కొంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానం సాధించాడు. ఆ తర్వాత వరుసగా అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే..ఆమె వార్షిక సంపాదన రూ.114 కోట్లు అని ఫోర్భ్స్ వెల్లడిస్తోంది. 


ఎం.ఎస్.ధోని,ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్స,చిన్ తెందుల్కర్అ,జయ్ దేవగణ్ ఉన్నారు. ఇదీ టాప్-10 జాబితా... సూపర్ స్టార్ రజనీకాంత్ 14వ స్థానంలో నిలిచాడు.  సైనా నెహ్వాల్ 58.. అల్లు అర్జున్ 64.. నయనతార 69.. కమల్ హాసన్ 71 ర్యాంకుల్లో నిలిచారు. రామ్ చరణ్.. విజయ్ దేవరకొండ సమానంగా 72వ స్థానంలో ఉండటం విశేషం.


ఫోర్బ్స్ జాబితాలో టాలీవుడ్ సెలబ్రిటీల స్థానం :

పవన్ కళ్యాణ్ 24వ స్థానం (రూ.31.33 కోట్లు)

ఎన్టీఆర్ — 28వ స్థానం (రూ.28 కోట్లు)

మహేష్ బాబు — 33వ స్థానం (రూ.24.33 కోట్లు)

నాగార్జున — 36 వ స్థానం (రూ.22.25 కోట్లు)

కొరటాల శివ — 39 వ స్థానం (రూ.20 కోట్లు)

అల్లు అర్జున్ — 64 వ స్థానం (15.67 కోట్లు)

రామ్ చరణ్ — 72 వ స్థానం (రూ.14 కోట్లు)

మరింత సమాచారం తెలుసుకోండి: