స్టార్ ప్రొడ్యూసర్ శంకర్, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ కాంబినేషన్ లో వచ్చిన '2.ఓ' మంచి హిట్ సాధించింది.  ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయ్యింది.  విజువల్ వండర్ క్రియేట్ చేస్తూ..అభిమానులను థియేటర్లకు రప్పిస్తుంది. అయితే ఏ సినిమా అయినా..ప్రజలకు వినోదమే కానీ..తీసే వారికి అది బిజినెస్. 2.ఓ' సినిమా మరోసారి ఈ బిజినెస్ యాంగిల్ ప్రూవ్ చేస్తోంది. ఇటు దేశంలో, అటు దేశం వెలుపలా కాసుల వర్షం కురిపిస్తోంది. 'బాహుబలి' తరువాత మరోమారు దక్షిణాది సినిమా సత్తా చాటుతోంది.
Image result for 2.0 movie
ఇండియన్ మూవీ హిస్టరీలో బాహుబలి, బాహుబలి '2.ఓ'  రేంజ్ లో రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమాను టార్గెట్ చేస్తూ వస్తుంది. ఒక్క రికార్డు విషయంలో ఇప్పుడు '2.ఓ' బాహుబలిని అధిగమించింది. బాలీవుడ్ డబ్బింగ్ వర్షన్‌గా రిలీజైన 'బాహుబలి' మొదటి భాగం... 117 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ సంఖ్యని '2.ఓ' తాజాగా దాటేసిందంటున్నారు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్. మొత్తంగా 200 కోట్లు మాత్రం '2.ఓ' హిందీ వర్షన్ సాధిస్తుందంటున్నారు. 
Image result for 2.0 movie
కాకపోతే..బాహుబలి - ది కన్ క్లూజన్' ఇంకా అందనంత దూరంలో ఉంది. ఆ సినిమా బాలీవుడ్ డబ్బింగ్ వర్షన్ 500 కోట్లు కొల్లగొట్టింది. '2.ఓ' ఎలా చూసినా దాని దరిదాపుల్లోకి వెళ్లేలా లేదట.   భారతదేశం లోపల '2.ఓ' వందల కోట్ల కలెక్షన్లు చర్చగా మారాయి. కానీ, దేశం ఆవల మాత్రం ఈ సినిమా ప్రదర్శించబోయే స్క్రీన్స్ సంఖ్య సంచలనం అవుతోంది.
Image result for 2.0 movie
అయితే, సినిమాలో విలన్‌గా నటించిన అక్షయ్ కుమార్‌కి మాత్రం ఇది ఖచ్చితంగా రికార్డే. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకూ 200 కోట్ల సినిమా లేదు. '2.ఓ' ఆ లోటు తీర్చేయనుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఎన్ని సినిమాల్లో నటించినా..ఆ 2.ఒ స్థాయిలో మంచి విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు.  మొత్తానికి  '2.ఓ' పుణ్యమా అని మంచి రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: