త్వరలో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా సెట్స్ లో సందడి చేశారట. ఆర్ఫెసిలో ఎన్.టి.ఆర్ సినిమాకు సంబందించి భారీ సెట్ వేశారట. ఆ సెట్స్ లో మోక్షజ్ఞ ప్రత్యక్షమయ్యాడట. 


కొన్నాళ్లుగా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎన్.టి.ఆర్ సెట్స్ లో మోక్షజ్ఞ కనబడటం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. యంగ్ బాలయ్య రోల్ లో మోక్షజ్ఞ కనబడతాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే. అయితే డైరెక్ట్ హీరోగా మోక్షజ్ఞను ఎంట్రీ చేసే బాధ్యత క్రిష్ తీసుకున్నాడని తెలుస్తుంది.  


ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరెక్ట్ చేస్తున్న క్రిష్ డైరక్షన్ లోనే మోక్షజ్ఞ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఎన్.టి.ఆర్ బయోపిక్ విషయానికొస్తే రెండు పార్టులుగా వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కథానాయకుడు జనవరి 9న సంక్రాంతి బరిలో దిగుతుంది. మహానాయకుడు జనవరి 24న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 


బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా క్రిష్ డైరక్షన్ లోనే వచ్చింది. ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ తేజ డైరక్షన్ లో మొదలుపెట్టినా కొద్దిరోజులకే తేజ ఆ సినిమా నుండి తప్పుకోగా క్రిష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈమధ్య వచ్చిన సాంగ్ సినిమాపై అంచనాలు పెంచింది. తప్పకుండా ఈ మూవీ అంచనాలను అందుకునేలా ఉంటుందని ఆశిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: