ఈ మద్య హాలీవుడ్ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాలను పొందుతున్నాయి.  డబ్బింగ్ సినిమాలు అయినా హాలీవుడ్ సినిమాలంటే ఇక్కడ ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు.  ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ లో ఈ సినిమాలు హై క్వాలిటీతో ఉండటంతో జనాలు బాగా ఇష్టపడుతున్నారు.  ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న  ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ట్రైలర్ వచ్చేసింది. మార్వెల్ స్టూడియో, ఈ ట్రైలర్‌ను ఈ నెల 5నే విడుదల చేయాలని నిర్ణయించింది అయితే సినియర్ బుష్ చనిపోవడంతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు.
Image result for avengers 4
‘ఇన్ఫినిటీ వార్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు కంట తడి పెట్టించాయి. క్లైమాక్స్‌లో థానోస్ తన వేలును కోసేసుకోవడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు సినిమాను ముగించిన తీరు సీక్వెల్ పార్ట్‌పై ఇంట్రెస్ట్ ఆసక్తి రేపింది. ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ‘మార్వెల్’ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కొన్ని అబ్బురపరిచే సన్నివేశాలతో పాటు, నిస్సాయతతో ఉన్న అవెంజర్స్‌ను చూడోచ్చు. అంతేకాకుండా ఈ ట్రైలర్‌లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికాతో పాటు హాక్ఐ, థోర్, బ్లాక్ విడో, హల్క్ నెబ్యులలను చూపిస్తున్నారు. 
Image result for avengers 4
ఈ ట్రైలర్‌లో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికాతో పాటు హాక్ఐ, థోర్, బ్లాక్ విడో, హల్క్ నెబ్యులలను చూపిస్తున్నారు.  ఇంతవరకు వచ్చిన సినిమాల్లో బ్లాక్ పాంథర్, స్పైడర్ మాన్, నిక్ ఫ్యూరీ, డాక్టర్ స్ట్రేంజ్, స్కార్లెట్ విచ్‌లను థానోస్ చంపింది తెలిసిందే. అయితే ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’లో  కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, బ్లాక్ విడో, హల్క్. మరీ వచ్చే అవెంజర్స్4 సినిమాలో వీళ్లు కూడా చస్తారా... లేక ఈ అందరు కలసి థానోస్‌ను అంతం చేస్తారా అన్ని విషయం వెండితెరపై చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: