ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన శివాజీరావొ గైక్వాడ్ తమిళ సీమలో సూపర్ స్టార్ అవడం అంతే సామాన్య విషయం కాదు. దాని వెనక ఎంతో కఠోరమైన శ్రమ ఉంది. అంకిత భావం ఉంది. అహరహం తపించే గుణం ఉంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అలుపెరగని పోరాటం కూడా ఉంది. ఎలా చూసుకున్నా అతను రణ జన్ముడిగా కారణ రన్ముడిగానే చెప్పుకోవాలి.


శివాజీరావు గైక్వాడ్ అసలు పేరు అయితే వెండి తెర పెట్టుకున్న పేరు రజనీకాంత్. ఈ పేరును పెట్టి బొట్టు పెట్టి దీవించింది. తమిళ సినిమాకే కాదు, యావత్తు భారత దేశం గర్వించే దిగ్దర్శకుడు బాలచందర్. అపూర్వ రాగాంగల్ మూవీ ద్వారా తమిళ చిత్ర సీమకు పరిచయం అయిన రజనీకాంత్ సూపర్ స్టార్ డం సాధించడానికి చాలనే కష్టపడ్డాడు. బెంగుళూర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా జీవితం ప్రారంభించిన రజనీ సినిమాల్లోకి రావాలని భావించి 1973లో మడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందారు.


ఆ తరువాత రెండేళ్ళకు అంటే 1975లో బాలచందర్ ఆయనకు  తొలి అవకాశం ఇచ్చారు.  ఆరంభంలో చిన్న పాత్రలు ఎన్నో వేసిన రజనీ తనను తాను రుజువు చేసుకుంటూ వచ్చారు. తెలుగులో అంతులేని కధ మూవీలో జయప్రదకు అన్నగా రజనీ చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆ మూవీలో చిత్రమేంటంటే అప్పటికే కమల్ హాసన్ తమిళ నాట పరిచయం అయి ఉన్నారు. మరో వైపు రజనీ కూడా అంతే.  ఈ ఇద్దరూ తెలుగులో మాత్రం అతి చిన్న పాత్రల్లో కనిపిస్తే జయప్రద హీరోయిన్ ఓరిఎంటెడ్ మూవీలో ఉండడం విశేషమే. అలా ఎదిగిన ఈ ఇద్దరు హీరోలు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లు కావడం గ్రేట్. 


రజనీ విషయానికి వస్తే డౌన్ టొ ఎర్త్ అంటారు. ఆయన ఎక్కడ నుంచి వచ్చి ఈ స్థాయిని అందుకున్నారో మూలాలను  మాత్రం మరచిపోలేదు. ఇప్పటికీ తన చిన్న నాటి స్నేహితులు బస్ కండక్టర్లతో కలసి అరేయ్ ఒరేయ్ అనిపించుకోవడం రజనీకే సాధ్యం. వారికి ఎంతో సాయం చేసిన రజనీ తన పాత నేస్తాలతో ఉన్నపుడే అసలైన ఆనందం దొరుకుతుందని చెబుతారు మంచికి మారు పేరుగా ఉన్న రజనీ తమిళ్ జనాలకు ఓ విధంగా దేవుడే అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: