ఈ మద్య బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.  అనీల్ కపూర్ కూతురు సోనం కపూర్ తో మొదలై ఈ నెల గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లి వరకు కొనసాగుతూ వచ్చింది.  అయితే బాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే.  దీపికా పదుకొని, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ తమ ప్రియులతో డేటింగ్ చేసిన కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు.  తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ ప్రముఖ ఫోటో గ్రాఫర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Image result for shraddha kapoor

బాలీవుడ్ ఒకప్పుడు విలన్ గా నటించి ప్రస్తుతం కామెడీ పాత్రల్లో నటిస్తున్న సీనియర్ నటుడు శక్తి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ప్రస్తుతం హీరోయిన్ గా రానిస్తున్నారు.  ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో ఒకటైన ‘సాహూ’సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తుంది.  వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నది.  ప్రస్తుతం శ్రద్దా కపూర్ ఫోటో గ్రాఫ‌ర్ రోహ‌న్ శ్రేష్ట‌తో డేటింగ్‌లో ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.  వీరిద్దరూ కలిసి చట్టా పట్టాలేసుకొని తిరగడం...రెస్టారెంట్లు, షూటింగ్ స్పాట్ పలు చోట్ల కలిసి తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Image result for shraddha kapoor

ఈ నేప‌థ్యంలో గ‌త రాత్రి శ్ర‌ద్ధా, రోహాన్ క‌లిసి బ‌య‌ట చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, వీరిద్ద‌రు కెమెరా కంటికి చిక్కారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా, వీరిద్దరి పరిచయం ఇప్పటిది కాదని గత తొమ్మిది సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉంటూ..కొన్ని నెల‌ల క్రితం నుండే వారిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నార‌ట‌. ఈ ఏడాది క‌ర‌ణ్ జోహ‌ర్ ఏర్పాటు చేసిన దీవాళి బాష్‌లో కూడా శ్ర‌ద్ధా క‌పూర్‌, రోహాన్‌లు జంట‌గా క‌నిపించారు. శ్ర‌ద్ధా ప్ర‌స్తుతం సాహోతో పాటు సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లోను న‌టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: