టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న రిలీషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పవర్ స్టార్ పవన్ కళ్యాన్, అల్లు అర్జున్ తో ఇప్పటికే పలు సినిమాలు తీశారు.  జల్సా, అత్తారింటికి దారేది సూపర్ హిట్ కాగా..ఆ మద్య అజ్ఞాత వాసి మాత్రం దెబ్బ తిన్నది.  ఇక అల్లు అర్జున్ తో తీసిన సినిమాలు జులాయి, సన్నాఫ్ కృష్ణమూర్తి సినిమాలతో మంచి విజయాన్ని అందించారు.  ఈ మద్య నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’తో మరో సూపర్ హిట్ అందుకున్నారు త్రివిక్రమ్.  ప్రస్తుతం త్రివిక్రమ్ -బన్నీ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
Image result for allu arjun
అయితే ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంపై పలు కార్యక్రమాలకు హాజరైన అల్లు అర్జున్ కూడా ఏ విషయం చెప్పలేదు. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అన్న అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి.  కానీ అందరికీ మెగా ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్ త్రివిక్రమ్, బన్నీ కోసం ఒక వైవిధ్యభరితమైన కథను తయారు చేసి రీసెంట్ గా స్క్రిప్ట్ వినిపించాడట. ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు .. చేర్పులు బన్నీ చెప్పాడట.
Image result for pawan kalyan
అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూ త్రివిక్రమ్ బిజీగా వున్నాడని అంటున్నారు.  త్రివిక్రమ్ మార్క్ ఉండేలా పంచ్ డైలాగ్స్ తో పాటు ఎంట్ర టైన్ మెంట్ ప్లాన్ చేస్తున్నారట.  అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూ త్రివిక్రమ్ బిజీగా వున్నాడని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగానే ఈ ప్రాజెక్టును గురించిన ప్రకటన చేయాలనే ఆలోచనలో వున్నారని అంటున్నారు. గతంలో త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: