ఇప్పుడు బయోపిక్ సినిమాలకు ప్రాధాన్యత పెరిగిపోతూ వస్తుంది.  మహానటి సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్ ’బయోపిక్ రూపొందుతుంది.  ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది..అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా రాబోతుంది.  దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా రాబోతుంది. మరోవైపు తెలంగాణ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయోపిక్, కాంతారావు బయోపిక్ లు రాబోతున్నాయి.  బాలీవుడ్ లో దోనీ, సంజయ్ దత్ బయోపిక్ లు కూడా తెరకెక్కించారు.  

Image result for సోనూ సూద్

తాజాగా బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు బ‌యోపిక్ ప‌ట్టాలెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నే విషయంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  స్టైలిష్ విలన్ గా రాణించడంతో సోనూ సూద్ కు ప్రత్యేక శైలి ఉంది. విలన్ గా చాలా సినిమాలో సోనూ సూద్ పాత్ర హైలైట్ గా నిలిచింది. అరుంధతి సినిమాలో సోనూ సూద్ పాత్ర ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటుంది.  

Image result for సోనూ సూద్

ఈ సినిమాలో తాను సింధుకు కోచ్ గా నటిస్తున్నట్లు తెలిపారు. సింధు పాత్రలో నటించే సరైన నటి కోసం అన్వేషణ జరుగుతున్నట్లు సోనూ సూద్ తెలిపారు. బాల్యం నుంచి సింధు క్రీడలపై ఆసక్తికతో ఒలంపిక్ మెడల్ విజేత స్థాయి వరకు ఎలా చేరుకుంది అనే అంశాలని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: