తెలంగాణా ప్రజల తీర్పు తేలిపోయింది. డిసెంబర్ 7న జరిగిన తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ లో భాగంగా టి.ఆర్.ఎస్ పార్టీ 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. ఎలాంటి సపోర్ట్ లేకుండా మళ్లీ కె.సి.ఆర్ ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఫాం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.


ఇక కౌంటింగ్ స్టార్ట్ కాగానే కె.టి.ఆర్ ట్విట్టర్ లో గన్ పెట్టి షూట్ చేస్తున్న పిక్ పెట్టారు. అయితే దీనికి విశేష స్పందన వస్తుంది. మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ ఒక్క బుల్లెట్ తో అంతమందా.. ఆ షాట్ గుర్తుంచుకోదగినదే అంటూ.. కంగ్రాట్స్ కె.టి.ఆర్ అన్నా అని ట్వీట్ చేశాడు మంచు మనోజ్. హరీష్ శంకర్ కూడా టి.ఆర్.ఎస్ ఆధిక్యాన్ని చూసి ఇది ప్రజాస్వామ్య తీర్పు అని చెప్పారు.


కె.టి.ఆర్ పెట్టిన గన్ షూట్ పిక్చర్స్ కు కోనా వెంకట్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ఒక్క పిక్ చాలు ఫలితం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోడానికి అంటూ ట్వీట్ చేశాడు కోనా వెంకట్. తెలంగాణాలో టి.ఆర్.ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టిడిపి, టి.జె.ఎఫ్, సిపిఐ ప్రజాకూటమి ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫలితాలతో తెలంగాణా ప్రజలు కే.సి.ఆర్ ప్రభుత్వాన్ని కోరుతున్నారని తేలిపోయింది.


తెలంగాణ రాష్ట్ర సాధ్యనలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కష్టపడిన కె.సి.ఆర్ కు మళ్లీ తెలంగాణా ప్రజలు రెండోసారి ప్రభుత్వ అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ సైతం వెనుకపడ్డారు. టి.ఆర్.ఎస్ కు పోటీగా మహాకూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: