విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు  జీతివ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ‘య‌న్.టి.ఆర్’. ఇందులో నుంచి రెండవ పాటను ఈ రోజు విడుదల చేశారు. ఈ సాంగ్ కూడా అన్న గారి గొప్పతనాన్ని చాటే విధంగానే ఉంది. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ పాటల విడుదల కూడా ఓ పధ్ధతి ప్రకారం హైప్ క్రియేట్ చేసేల చూసుకున్నారు. 


‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ టైటిల్స్‌తో రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది.  కాగా, ఇప్ప‌టికే విడుద‌లైన ‘క‌థానాయ‌కా..’ అనే పాటకు విశేష స్పంద‌న లభిస్తోంది. ఈ చిత్రంలోని ‘రాజర్షి..’ అనే రెండో పాటను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ‘తల్లి ఏదీ? తండ్రి ఏడీ? అడ్డుతగిలే బంధమేది?..’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.ఈ చిత్రానికి ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందించారు. మిగిలిన పాటల్ని కూడా ఈ నెలలోనే విడుదల చేస్తారట. 


ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, శ్రీదేవి పాత్రలో ర‌కుల్ ప్రీత్‌ సింగ్‌, ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాల‌న్, హరికృష్ణ పాత్రలో క‌ళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్యామేన‌న్ న‌టిస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎన్ బి కే ఫిల్మ్స్, వారాహి చ‌ల‌న‌చిత్రం, విబ్రి మీడియా సంస్థలపై నంద‌మూరి బాల‌కృష్ణ‌, సాయి కొర్ర‌పాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలు జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మొత్తానికి ఈ మూవీకి హైప్ తీసుకురావడంలో చిత్ర బ్రుందం సక్సెస్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: