డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘సూపర్’సినిమాతో పరిచయం అయిన అనుష్క తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.  మంచి పర్సనాలిటీ..అందం, అభినయంతో  స్టార్ హీరోల సరసన వరుసగా ఛాన్సులు కొట్టేసింది.  తెలుగు, తమిళ భాషల్లో పలు గ్లామర్ పాత్రల్లో నటించిన అనుష్క ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘అరుంధతి’లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.
Image result for anushka shetty
గత కొంత కాలంగా అనుష్క కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది.  గ్లామర్ డోస్ పూర్తిగా తగ్గించడంతో సినిమా ఛాన్సులు తక్కువ వస్తున్నాయని ఆ మద్య వార్తలు వచ్చాయి.  అయితే డీ గ్లామర్ పాత్రలో బాహుబలి పార్ట్ 1 లో నటించిన అనుష్క ‘బాహుబలి2’ లో అందాల మహారాణిగా కనిపించింది.   'బాహుబలి2' సినిమా తరువాత ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
Image result for anushka shetty
ప్రస్తుతం అనుష్క.. మాధవన్ హీరోగా 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వంలోరూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా  సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ మద్య సంవత్సరానికి రెండూ, మూడు సినిమాల్లో నటించే అనుష్క తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది..ఇక పై ఏడాదికి ఒక్క సినిమాలో మాత్రమే ఆమె నటించాలని భావిస్తున్నారట.
Image result for anushka shetty
బాహుబలితో వచ్చిన క్రేజ్ ని కొనసాగించడానికి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తే సరిపోదని సరికొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకుందట.  మరి మాధవన్ తో నటించబోయే సినిమా గ్రాండ్ సక్సెస్ అయితే నిర్ణయం మార్చుకుంటుందో..లేదో అలాగే కంటిన్యూ చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా బొమ్మాళి తీసుకున్న నిర్ణయానికి ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: