ఈ సంవత్సరం టాలీవుడ్ కి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.  ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు వరుస విజయాలు నమోదు చేసుకున్నాయి.  అంతే కాదు బయోపిక్ సినిమాగా వచ్చిన ‘మహానటి’ కూడా సూపర్ హిట్ కావడమే కాదు కలెక్షన్లు కూడా బాగానే వసూళ్లు చేసింది.  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెలుగు లో మొదటి సారిగా సినీ నేపథ్యంలో వచ్చిన ‘మహానటి’ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.  కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన  ‘అరవింద సమేత’సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 
Related image
చిన్న సినిమాలుగా విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’,‘టాక్సీవాలా’ రెండు సూపర్ హిట్ అయ్యాయి. గీతాగోవిందం ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  కొత్త దర్శకుడు, హీరో, హీరోయిన్లతో ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా కూడా మంచి విజయం పొందింది. తాజాగా సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో గేమ్స్ , తదితర వర్గాలకి సంబంధించిన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్ మెంట్ డాటాబేస్ ) తాజాగా 2018కి గాను ఇండియాలో టాప్ టెన్ మూవీస్ లిస్ట్ విడుద‌ల చేసింది . 
Image result for mahanati movies
ఈ లీస్ట్ లో మహానటి (4), రంగస్థలం(7) స్థానాల్లో చోటు సంపాందించాయి.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో లీడ్ రోల్ కీర్తి సురేష్ పోషించింది.  స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్, విజ‌య్ దేవ‌ర‌కొండ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచరణ్, సమంతలతో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  బాహుబలి తరువాత అత్యదిక వసూళ్లను సాధించిన రెండవ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో అన‌సూయ‌, ప్ర‌కాశ్ రాజ్,జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు. 

ఐఎండిబి 2018 టాప్ 10 లో చోటు సంపాదించిన సినిమాలు :

1. అంధాదున్ (హిందీ )

2. రట్సాసన్ (తమిళం )

3. 96 (తమిళం )

4. మహానటి (తెలుగు)

5. బడాయి హో (హిందీ)

6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)

7. రంగస్థలం (తెలుగు)

8. స్ట్రీ (హిందీ)

9. రాజీ (హిందీ)

10. సంజు (హిందీ)


మరింత సమాచారం తెలుసుకోండి: