బాలీవుడ్ లో ఈ మద్య వరుసగా స్టార్స్ పెళ్లిపీఠలు ఎక్కుతున్నారు.  ఈ నేపథ్యంలో పాపుల‌ర్ క‌మెడీయ‌న్ కం యాక్ట‌ర్ క‌పిల్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కి ఓ ఇంటి వాడ‌య్యాడు.  కపిల్ శర్మ అంటే నార్త్ లో తెలియని వారుండరు. అలాగే సౌత్ లో కూడా ఆ షో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కపిల్ శర్మ తన కామెడీ టైమింగ్ తో లైవ్ లోనే కడుపుబ్బా నవ్వించగలడని ఒక స్పెషల్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రెటీలతో తన ప్రోగ్రామ్ లో నవ్వులు పువ్వులు పూయిస్తాడు.  గత కొన్నేళ్లుగా గిన్ని ఛత్రాత్ అనే అమ్మాయితో కపిల్ లవ్ ను కొనసాగిస్తున్నాడు.
Kapil Sharma
గతంలోనే వీరి పెళ్లికి సంబందించిన వార్తలు చాలా వచ్చాయి.  మొత్తానికి బుధవారం ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా  వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. రెడ్ క‌ల‌ర్ లెహంగాలో పెళ్లి కూతురు మెరిసిపోగా, క‌పిల్ థ్రెడ్ వ‌ర్క్‌తో ఉన్న‌ గ్రీన్ షెర్వాణీ ధ‌రించాడు. నెక్స్ట్ సెలబ్రెటీలను ఆహ్వానించి రిసెప్షన్స్ పార్టీని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ మధ్య సంగీత్ మెహందీ వంటి ఫంక్షన్స్ జరుపుకున్నప్పటికీ కపిల్ పోటోలను విడుదల చేయలేదు. కానీ మొదటిసారి వివహం జరిగిన అనంతరం దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
Image result for క‌పిల్ శ‌ర్మ పెళ్లి
 క‌పిల్ సన్నిహితులు సుమోనా చ‌క్ర‌వ‌ర్తి, , కృష్ణ అభిషేక్, రాజీవ్ ఠాకూర్‌, భ‌ర్తీ సింగ్‌, హ‌రీష్ లింబాచియా త‌దిత‌రులు పెళ్లిలో సంద‌డి చేశారు.  క‌పిల్ త‌న పెళ్ళిని ‘కపిల్‌ శర్మా కీ షాదీ హై!! పూరే ఇండియా కో ఆనా హై’ పేరుతో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాడు. పెళ్ళి కోసం పంజాబ్ వెళ్ల‌కుండా ఇంట్లో కూర్చునే త‌న పెళ్లిని వీక్షించే ఏర్పాట్లు క‌పిల్ చేశాడు. కుటుంబ స‌భ్యుల కోసం డిసెంబ‌ర్ 14న అమృత‌స‌ర్‌లో ఒక రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది . రెండోది డిసెంబ‌ర్ 24న ముంబైలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ వేడుక‌కి సినిమా ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌ముఖులు, స్నేహితులు హాజ‌రు కానున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: