అన్న గారి రాజకీయ జీవితంలో చంద్రబాబుది అతి ముఖ్య పాత్ర. ఆయన అల్లుడు కాకముందే రాజకీయాల్లో ఉంటూ కాంగ్రెస్ తరఫున మంత్రిగా పనిచేసిన చంద్రబాబు యన్‌.టి.ఆర్‌’ మూడవ కుమార్తెను వివాహం చేసుకున్నాక మరింతగా గుర్తింపు  పొందారు. ఇక రాజకీయాల్లోకి యన్‌.టి.ఆర్‌’ వచ్చాక తెలుగుదేశం గెలిచిన తరువాత ఆయన పార్టీలో చేరి చక్త్రం తిప్పిన చంద్రబాబు చివరికి యన్‌.టి.ఆర్‌’ వారసునిగా ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ వారసత్వం ఎలా వచ్చింది. ఎలా తీసుకున్నారన్నది పక్కన పెడితే యన్‌.టి.ఆర్‌’ రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే అందులో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉండాల్సిందే.


యన్‌.టి.ఆర్‌’తనయుడు నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం యన్‌.టి.ఆర్‌’కధానాయకుడు, యన్‌.టి.ఆర్‌’ మహా నాయకుడు.  రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో రెండవ భాగంలో చంద్రబాబు కనిపిస్తారు. ఆ పాత్రను దగ్గుబాటి వారి వారసుడు రానా పోషించారు. దర్శకుడు క్రిష్ ఆ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు. అచ్చం చంద్రబాబులాగానే ఉన్నారే అనిపించేలా రానాను  తీర్చిదిద్దారు. 


ఇక ఈ రోజు రానా పుట్టిన రోజు. అంటే సినీ చంద్రబాబు బర్త్ డే అన్న మాట. అందువాల యన్‌.టి.ఆర్‌’ మూవీ మేకర్స్ చంద్రబాబు గెటప్ లో ఉన్న రానా ఫోటోను విడుదల చేశారు. ఈ పిక్ ఇపుడు బాగా అందరినీ ఆకట్టుకుంటోంది. చంద్రబాబులా  రానా అచ్చు గుద్దినట్లుగా ఉన్నారని అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధిని ఆడియోను ఈ నెల 21న నిమ్మకూరులో విడుదల చేస్తారట. అలాగే టీజర్ ని ఈ నెల 16న హైదరాబాద్ లో రిలీజ్ చేస్తారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: