పదహారు ఆ పదానికే ఏదో వైబ్రేషన్ ఉంది. పదహారు కళలు చంద్రుడికి ఉంటాయి. పడుచు ప్రాయం అమ్మాయిలకు పదహారు వస్తే ఆ అందమే వేరు. ఇక సినిమా రంగంలో అన్నేళ్ళ పాటు హీరోయిన్ గా ఉండడం అంటే అది ఇంకా పెద్ద ముచ్చట. అటువంటి ఫీట్ ని అధిగమించి తనకు తానే సాటి అనిపించుకుంది ఓ ముద్దు గుమ్మ. ఆమే మన అందాల తార త్రిష. త్రిష సినిమా రంగానికి వచ్చి అపుడే పదహారేళ్ళు గడచిపోయాయంటే అవునా నిజమేనా అనిపిస్తుంది. ఒకటిన్నర దశాబ్దం పైగా తన వన్నె చిన్నెలతో అలరించడం అంటే ఆషా మాషీ వ్యవహారం కానే కాదు సుమా


త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోల వరకూ అందరితోనూ జట కట్టి సరి లేరనిపించుకుంది. త్రిషకు టాలీవుడ్లో మంచి హిట్లే పడ్డాయి. వెంకటేష్ తో ఆమె చేసిన ఆడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే మూవీ ఇప్పటికీ చూడాలనిపిస్తుంది. అలాగే నాగార్జున తో కింగ్ మూవీలో ఆమె గ్లామర్ ఓ ప్లస్ పాయింట్ గా చెప్పాలి. ఇక రవితేజా మాంచి దూకుడు గా ఉన్న టైంలో త్రిషతో చేసిన క్రిష్ణ మూవీ సాగ్స్ ఇప్పటికీ కేక పెట్టిస్తాయి. ప్రభాస్ తో వర్షం మూవీలో త్రిష తొలినాటి సోయగాలు ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి.


ఇదిలా ఉండగా కెరీర్లో ఆమె గ్లామర్ తో పాటు అన్ని రకాల పాత్రలనూ చేసింది. ముఖ్యంగా కోలీవుడ్లో ఆమెకు మంచి పాత్రలు దొరికాయి. ఇక అక్కడ కమలహాసన్ తో నటించిన త్రిష మరో టాప్ స్టార్ రజనీకాంత్ తో కూడా జోడీ కట్టింది. ఈ ఇద్దరి మూవీ పేట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. డిసంబర్ 16 తో త్రిష వెండి తెరపై కనిపించి పదహారు ఏళ్ళు  పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా తనను ఆదరించీ అందరికీ త్రిష ధన్య‌వాదాలు తెలియచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: