తాప్సి సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది అయితే ‘ఐ లవ్ యువర్ బాడీ పార్ట్స్’ అంటూ ట్వీట్ చేసిన ఒక నెటిజన్ కు సెటైరికల్ ఆన్సర్ చెప్పింటి నటి తాప్సీ. నీ బాడీ పార్ట్స్ ను ప్రేమిస్తున్నాను అంటూ అతడు ట్వీట్ చేయడంలో ఉద్దేశం ఏమిటో అందరికీ అర్థం అయ్యేదే. ఈ మాట వినగానే తాప్సీ చెలరేగిపోకుండా.. సూటిగా, సుతిమెత్తగా సమాధానం ఇచ్చింది. ఆ మెత్తటి సమాధానమే కత్తిలా దిగిపోయేలా ఉంది.

బాలీవుడ్ చిత్రాలతో

నా బాడీ పార్ట్స్ అంటే ఇష్టమా.. నేను కూడా నా శరీర భాగాలని ఇష్టపడతాను.. నీకు ఏ పార్ట్ అంటే ఇష్టం. నాకు మాత్రం అన్నింటికన్నా మస్తిష్కం అంటే ఇష్టం అని తెలిపింది. తనకు బుద్ది ఉన్న వాళ్లంటే ఇష్టం అని తాప్సి ఇలా ఘాటుగా అతడికి కౌటర్ ఇచ్చింది. మరొకసారి అతడు వల్గర్ కామెంట్స్ చేయకుండా నోరు మూయించింది. బులెట్ దెబ్బకన్నా తాప్సి రిప్లై వెయ్యి రెట్లు అదిరిపోయింది. ఆ వేదవకు కనీసం అతడి ఫోటో పెట్టె ధైర్యం కూడాలేదు అని ఓ నెటిజన్ తాప్సిని ప్రశంసించాడు. తాప్సి మరోమారు తన కూల్‌నెస్ ని బయటపెట్టింది మరికొందరు ప్రశంసిస్తున్నారు. 

సెక్సీ కామెంట్.. తాప్సీ ఘాటు రిప్లై!

ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న మిషన్ మంగళ్ చిత్రమో తాప్సి అవకాశం దక్కించుకుంది. విభిన్న చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది కానీ గ్లామర్ పాత్రలు మాత్రం తాప్సికి దక్కడం లేదు. తాప్సి టాలీవుడ్ కు పూర్తిగా దూరం కావడంతో ఇక్కడ బాగా సన్నగిల్లాయి. తాప్సి చివరగా తెలుగులో నటించిన చిత్రం నీవెవరో. 

మరింత సమాచారం తెలుసుకోండి: