తమిళ హీరో, నిర్మాత,  తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పై తాజాగా చిన్న నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాల్ కి అక్కడ ఎంత మంచి పేరుందో అదే స్థాయిలో శత్రువులు అదే స్థాయిలో ఉన్నారు.  ఈ మద్య వరుస విజయాలు అందుకుంటున్న విశాల్ తాజాగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.  తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఉన్న విశాల్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం నిర్మాతలు ఆందోళన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు టీనగర్‌లోని నిర్మాతల సంఘం భవనానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. ఆ తాళం చెవులను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. 
Image result for tamil producers
ఈ నెల 21న తమిళంలో ఒకేరోజు ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే, ఇన్ని సినిమాలు ఒకేరోజు విడుదలైతే చిన్న సినిమాలు, చిన్న సినిమాల నిర్మాతలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆ:దోళనకు  విశాల్ వ్యతిరేకవర్గం కూడా తోడు కావడంతో గొడవ రచ్చ రచ్చ అయ్యింది. అయితే టీఎఫ్‌పీసీలోని దాదాపు 50మంది నిర్మాతలు విశాల్ వైఖరికి వ్యతిరేకంగా టీఎఫ్‌పీసీ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. కానీ ఆ సమయానికి హీరో విశాలు అక్కడ లేక పోవడంతో కౌన్సిల్ సెక్రటరీ కదిరేశన్‌తో విశాల్ వ్యతిరేక వర్గం వాగ్వాదానికి  దిగారు.
Image result for vishal
అయితే విశాల్ తో గత కొంత కాలంగా స్నేహంగా ఉంటున్న నిర్మాతలు ఆర్కే సురేష్, ఉదయ కూడా ఇప్పుడు వ్యతిరేకంగా మారడం పై వివాదం పెద్దదే అనిపించేలా ఉంది. చిన్న నిర్మాత గురించి పట్టించుకోకుండా బడా నిర్మాతలకు కొమ్ము కాస్తున్నాడని..ఒకే రోజు తొమ్మిది సినిమాలు రిలీజ్ అయితే తమ పరిస్థితి ఏంటని విశాల్ ఆలోచించడం లేదని..గతంలో ఆయన ప్రెసిడెంట్ గా నియమితులైన సమయంలో ఎన్నో వాగ్ధానాలు చేశారని..వాటన్నింటిని మర్చిపోయారని ఆరోపిస్తున్నారు.  2017లో విశాల్ తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా కూడా విశాల్ పనిచేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: