భారతీయ చలన చిత్ర రంగంలో జాతీయ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘ఒడియాన్’ 14న రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసిన ఈ సినిమా తెలుగు లో మిశ్రమ స్పందన వచ్చింది.  మాలీవుడ్ లో సూపర్ స్టార్ మోహన్ లాల్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే..అభిమానుల్లో సందడి నెలకొంటుంది.  ఈ సినిమా రిలీజ్ సందర్భంగా భారీ మోహన్ లాల్ కి భారీ కటౌట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Image result for odian movie release
శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇంతవరకూ చేయని ఒక విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో మోహన్ లాల్ పోషించారు. మాలీవుడ్ లో విడుదలకి ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేరళలో విడుదలైన తొలి రోజున ఈ సినిమా 7 కోట్లను వసూలు చేసింది. దాంతో వారాంతానికి ఈ సినిమా ‘బాహుబలి 2’వసూళ్లను అధిగమించి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావించారు. కానీ ఆ అంచనాలకు అందుకోలేక పోయింది ఒడియాన్.
Image result for baahubali 2
వారాంతానికి ఈ సినిమా 15 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది.  అయితే బాహుబలి 2 అప్పట్లో అన్ని భాషల్లో హిట్ టాక్ తెచ్చుకోవడంతో వారాంతానికి రూ.15.8 కోట్లు వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది. మొత్తానికి కోలీవుడ్ లో మోహన్ లాల్ నటించిన ‘ఒడియాన్’మంచి హిట్ అయినా..బాహుబలి 2 రికార్డు మాత్రం చెరపలేక పోయింది. దాంతో ఆ రికార్డు 'బాహుబలి 2' పేరుతోనే ఉండిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: