అన్న నందమూరి అంటే తెలుగు చలన చిత్ర సీమకు కలికి తురాయి లాంటి వారు. ఆయన వచ్చాకే స్టార్ డం మొదలైంది. ఆయన సినిమాకు గ్లామర్, గ్రామర్ నేర్పారు. మాస్ క్లాస్ అంటూ డివిజన్ కూడా వచ్చింది. తెలుగు సినిమా వైభవాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళి టాలీవుడ్ పితామహునిగా ‘ఎన్టీఆర్’ చరిత్రలో నిలిచిపోతారు. అటువంటి అన్న గారి జీవిత చరిత్రను తీసుకుని అద్భుతమైన రీతిలో తనయుడు బాలక్రిష్ణ తీస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ అంటే తెలుగు సినిమా మరో మారు తనను తాను చూసుకునోవడమే మరి.


అటువంటి మహత్త్రమైన చిత్రానికి సంబంధించిన తొలి ఘట్టం ఒకటి ఈ రోజు జరగబోతోంది. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ ఆడియో వేడుకను అయన పుట్టిన నిమ్మకూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు అథిరధ మహారధులు హాజరవుతారని భావిస్తున్నారు. ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఆనాటి నటీమణులు జమున, గీతాంజలీ సహా చాలా మంది ప్రముఖులు హాజరుకానున్నారు అన్న గారితో స్రీన్ పంచుకున్న వారంతా ఆడియో వేడుకలో కనిపించి కనువిందు చేస్తారని సమాచారం.


ఇదిలా ఉండగా ఆడియో వేడుకకు ఇన్వీటె చేయడానికి సూపర్ స్టార్ క్రిష్ణ ఇంటిని వెళ్ళిన బాలయ్య ఈ సందర్భంగా అన్న గారి గెటప్పులతో తాను నటించిన కొన్ని స్టిల్స్ ని క్రిష్ణకు చూపించారట. వాటిని చూసిన క్రిష్ణ అదుర్స్ బాలయ్యా అంటూ ఓ రేంజిలో పొగిడారని చెబుతున్నారు. నిజానికి క్రిష్ణ కూడా అన్న గారి కి బిగ్ ఫ్యాన్. ఆ సంగతిని ఆయన చాల సందర్భాలలో చెప్పుకొచ్చారు  కచ్చితంగా ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైల్ స్టోన్ అవుతుందని క్రిష్ణ పేర్కొనడం అన్నగారి బయోపిక్ కి నిండు ఆశీర్వాదమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: