తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను ‘అమ్మ’అంటూ ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు.  సినీ నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జయలలిత తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సీఎం గా తమిళ నాట చెరగని ముద్ర వేశారు.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ క్విన్ గా వెలిగిపోతూ..తమిళ నాట ఎంజీఆర్ తో సన్నిహితంగా ఉంటు వచ్చిన ఆమె ఆయన మరణాంతరం రాజకీయ వారసురాలిగా అన్నాడీఎంకే అధినేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. 
Image result for jayalalitha biopic
ఎన్ని వొడిదుడుకులు వచ్చినా..రాజకీయాల్లో తన ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతూ ముందుకు సాగారు.  ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ లు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో జయలలిత బయోపిక్‌లను తెరకెక్కించేందుకు కోలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె చరిత్ర ఆధారంగా నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి.  జయలలిత పాత్రలో నిత్యామేనన్, విద్యాబాలన్ తదితరులు నటిస్తున్నారు.

సీనియర్ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించే సినిమాకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. ఈ సమయంలో ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.  జయలలిత బయోపిక్ ని సీరియల్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.  సినిమా స్థాయిలో 30 ఎపిసోడ్‌లతో జయలలిత బయోపిక్ సీరియల్ రూపొందించేందుకు గౌతమ్ మేనన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంటుందని తెలుస్తోంది.

సుమారు రూ.25కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సీరియల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.  ఈ విషయంపై ఓ ప్రముఖ ఛానల్ తో ఇప్పటికే గౌతమ్ మీనన్ సంప్రదించినట్లు తెలుస్తుంది.  అయితే జయలలిత పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తుంది. ఈ మద్య రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో శివగామిగా రమ్యకృష్ణకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది.  ఈ మెగా సీరియల్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: