మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.  కొంత కాలంగా యూపిఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.  తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపిలో కాంగ్రెస్ కి మనుగడ లేకుండా పోయింది. దాంతో ఆయన మళ్లీ సినీ రంగ ప్రవేశం చేశారు.  వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమా రైతు సమస్యలపై పోరాడే ఓ యువకుడి పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించడంమే కాదు..మరో మాస్ పాత్రలో అభిమానులు ఉర్రూతలూగించారు. 

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు.  ఆ మద్య ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు.  అంతే కాదు ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ వచ్చారు.  అంతే కాదు ఈ సినిమాలో భారీ తారాగణం ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.   ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తోంది. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో తమన్నా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజున తమన్నా పుట్టినరోజు.
Image result for saira narasimha reddy
ఈ సందర్భంగా తమన్నా పాత్రను పరిచయం చేస్తూ .. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె ఫస్టులుక్ ను .. మోషన్ టీజర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తమన్నా .. లక్ష్మి పాత్రలో కనిపించనుందనేది మోషన్ టీజర్ వలన తెలుస్తోంది.  అంతే కాదు ఆ కాలం నాటి కట్టూ బొట్టు చూస్తే కలవారి అమ్మాయిలా కనిపిస్తుంది. అంతే కాదు..కొత్త తమన్నాను తెరపై చూడబోతున్నామనే ఆసక్తిని పెంచుతోంది. 'బాహుబలి' తరువాత తమన్నా చేస్తోన్న భారీ సినిమా ఇదే. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే ఆశాభావంతో తమన్నా వుంది.

Related image

Image result for saira narasimha reddy


మరింత సమాచారం తెలుసుకోండి: