ప్రభాస్ తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడం తో కోర్ట్ ను ఆశ్రయించిన సంగతీ తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వేనెంబర్ 5/3లోని 2083 గజాల స్థలాన్ని 2005 - 2006లో బి.వైష్ణవి రెడ్డి - రవీందర్ రెడ్డిల నుంచి ప్రభాస్ కొనుగోలు చేశారని ప్రభాస్ తరఫు న్యాయవాది చెప్పారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. 

Image result for prabhas

క్రమబద్ధీకరణ కోరుతూ ఫీజును కూడా చెల్లించారని గుర్తుచేశారు.    ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ కుమార్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సర్వే నెంబర్ 5/3లో ఉన్నది ప్రభుత్వ భూమి అని చెప్పారు. క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చింది దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న వారి కోసమేనని పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ బీపీఎల్ పరిధిలోకి వస్తారా అని ప్రశ్నించింది. అయితే ప్రభాస్ బీపీఎల్ పరిధిలోకి రారని - ఆయన బాహుబలి అని శరత్ చెప్పారు.

ఊరట లభించింది కానీ ఉత్కంఠ కొనసాగుతోంది

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఓ ఇతను ఆ బాహుబలినా.. మరి పిటిషన్లో ఉన్న పేరు అతనిదేనా? అంటూ ఆరా తీసింది. పిటిషనర్ అతనేనని నిరంజన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. కాగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి శరత్ చెప్పారు.    దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి - రంగారెడ్డి జిల్లా కలెక్టర్ - శేరిలింగంపల్లి తహసీల్దార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: