హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడు లారెన్స్. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ తర్వాత నటుడు, దర్శకుడు, నిర్మాతగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ముని సినిమాతో నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లారెన్స్  2011లో రిలీజ్ చేసారు. ఆ సినిమా సీక్వెల్ గా కాంచన, గంగా సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు ముని సిరీస్‌లో నాలుగో సినిమా రూపొందుతుంది.

కాంచ‌న 3 అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.  లారెన్స్ దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను సాధించాయి. దాంతో 'కాంచన' సిరీస్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Image result for kanchana
అయితే ఇంతకు ముందు వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాల కంటే ఈ సినిమా మరింతగా భయపెడుతుందని చెబుతున్నారు రాఘవ లారెన్స్.  భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది. ముని సిరీస్‌లో వ‌స్తున్న ‘కాంచ‌న 3’ సినిమాకి  లారెన్స్ నిర్మాత‌గాను వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.
Image result for ganga movie
ఇక ‘కాంచన' సిరీస్ లోని సినిమాలకి భారీ వసూళ్లు వచ్చిన కారణంగా, 'కాంచన 3' తెలుగు హక్కులను సొంతం చేసుకోవడానికి చాలామంది నిర్మాతలు పోటీపడుతున్నారట. చివరికి తెలుగు హక్కులు ఎవరి చేతికి దక్కుతాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: