సాధారణంగా ఇద్దరు ప్రేమికుల సరసాలు..సల్లాపాలు సైగలతో నడుస్తుంటాయి.   సినిమాల్లో అయితే ఒకప్పుడు కన్ను గీటి ప్రియుడిని ప్రేయసి రమ్మనడం..ప్రియుడు సైతం ప్రేయసికి కన్నుగీటం థియేటర్లో అభిమానులకు ఎంతో థ్రిల్ అనిపించేది.  కానీ కాలం మారింది..సెల్ ఫోన్లు..వాట్సాప్ లతో లవర్స్ తమ ప్రేమ సంబంధాలు కొనసాగిస్తున్నారు.  చాలా కాలం తర్వాత కన్నుకొట్టి కుర్రకారు గుండెల్లో వేగం పెంచింది మళియాళ బ్యూటీ ప్రియా వారియర్.  మలయాళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ సినిమా 'ఒరు ఆదార్ లవ్'. 

Image result for priya varrier lovers day

ఈ సినిమా నుంచి వదిలిన ఒక వీడియోలో కన్నుగీటిన ప్రియా వారియర్ ను చూసి కుర్రాళ్లంతా మనసు పారేసుకున్నారు. ఈ ఒక్క సినిమాతో ఆమె సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒమర్ లూలూ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.  ‘ఒరు ఆధార్ లవ్’ సినిమాలో ‘‘మాణిక్య మలరాయ పూవి’’ పాటలో ప్రియా చూపిన హావభావాలు యువత మనసు దోచేశాయి. అందులో ప్రియా కన్నుగీటిన తీరు.. ఆమెకు దేశవ్యాప్త క్రేజ్ తెచ్చిపెట్టింది. 

Image result for priya varrier lovers day

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఆమెకు ఫిదా అయ్యారు.   సినిమా విడుదలకు ముందే ఆమె స్టార్ స్టేటస్ పొంది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు 2018 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సెలబ్రిటీగా కూడా రికార్డు సృష్టించింది.‘ఒరు ఆధార్ లవ్’తెలుగులో కూడా ‘లవర్స్ డే’ పేరుతో అదే రోజు (ఫిబ్రవరి 14)న సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత‌లు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మేరకు ప్రియా పోస్టర్స్‌ షేర్ చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ లెక్కన ప్రేమికుల రోజున ప్రియా సందడిలో తడిసి ముద్ద కానున్నారన్నమాట ప్రేమికులు.


మరింత సమాచారం తెలుసుకోండి: