సినిమాలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు..ఒకప్పుడు తమకు నచ్చిన సినిమాలంటే ఇంటిల్లిపాది వెల్లి హ్యాపిగా ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు థియేటర్లోకి ఫ్యామిలీతొో వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.  ముఖ్యంగా సామాన్యుల విషయంలో ఇది మరీ దారుణంగా మారింది.  టిక్కెట్ల ధర చూస్తే..గుండెల్లో గుబులు పుడుతున్నాయి.  పెద్ద హీరోల సినిమాలు వస్తే..బ్లాక్ లో సగం టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి..తమ అభిమాన హీరో సినిమా కోసం ఎంతైన వెచ్చిస్తున్నారు. దాంతో సామాన్యులు థియేటర్లోకి వెళ్లి సినిమాలు చూడటం గగనం అవుతున్నాయి. 

Image result for indian movie tickets

ఇక మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లలో మద్యతరగతి చెందిన వారు సినిమాలు చూడటం చాలా కష్టంగా మారింది.  దాంతో పైరసీకి ఎక్కువ ప్రాధాన్య ఇవ్వడంతో నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంటుంది. కోట్లు పెట్టి తాము సినిమాలు తీస్తుంటే..సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే పైరసీ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుంది.  దాంతో నిర్మాతలు సినిమాలు తీయడానికి వెనుకాముందు అడుతున్నారు. 

Image result for indian movie tickets gst

తాజాగా సినీ ప్రియులకు, నిర్మాతలకు శుభవార్త.  సినిమా టికెట్లపై జీఎస్టీని త‌గ్గించ‌డం ప‌ట్ల ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఇది ప్ర‌గ‌తిశీల అడుగు అని గిల్డ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. వంద లోపు ఉన్న సినిమా టికెట్ ధ‌ర‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి త‌గ్గించారు. వంద పైన ఉన్న టికెట్ ధ‌ర‌పై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి త‌గ్గించారు. దీంతో ఫిల్మ్ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి.  గత కొంత కాలంగా ల్మ్ ఇండ‌స్ట్రీకి ఊతం ఇస్తున్న కేంద్ర ప్ర‌భుత్వానికి స‌హ‌కరిస్తూనే ఉంటామ‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సిద్ధార్ధ రాయ్ కపూర్ లేఖ‌లో వెల్ల‌డించారు. కేంద్రం తీసుకున్న చ‌ర్య హ‌ర్ష‌ణీయ‌మ‌ని, మోదీకి థ్యాంక్స్ అంటూ బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ట్వీట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: