కోలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలను చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ట్రై చేస్తున్న నటీమణి ధన్సిక. సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వచ్చిన కబాలి సినిమాలో ధన్సిక క్రేజీ రోల్ చేసింది. ఆ సినిమాలో ఆమె నటనకు అందరు ఫిదా అయ్యారు. ఇక తమిళంలో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం యోగి డా మూవీ చేస్తుంది. 


యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ధన్సిక లీడ్ రోల్ చేస్తుంది. ఇందులో ధన్సిక కూడా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ లో పాల్గొందట. ఈమధ్య బార్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న టైంలో ఓ పగిలిన బీర్ బాటిల్ ఆమె కంటికింద గుచ్చుకుందట. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లి చూపించారట.


అయితే కంటికి గాయమైనా సరే ఆమె షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లిందట. గౌతం కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అరుణాగిరి, రాజ్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు. సగానికి పైగా పూర్తయిన ఈ సినిమా షూటింగ్ కు కొంత బ్రేక్ ఇచ్చారట. ధన్సిక కాస్త కోలుకున్నాక మళ్లీ షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది.


కోలీవుడ్ లో నయనతార మార్గంలో ధన్సిక కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఈ సినిమాతో ధన్సిక తన సత్తా చాటాలని చూస్తుంది. సినిమాలో ధన్సిక అదరగొట్టేస్తుందని చెబుతున్నారు. కొత్త కథ కొత్త ప్రయత్నంగా ఈ మూవీ ఉంటుందట. మరి ధన్సిక ఇంత కష్టపడుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: