సీనియర్ హీరోల్లో 100 సినిమాలు చేసిన వారు తక్కువే.. కెరియర్ విలన్ గా మొదలు పెట్టి హీరోగా ఎదిగి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఫ్యామిలీ హీరో శ్రీకాంత్. అప్పట్లో మీడియం బడ్జెట్ సినిమాలకు కనిపించే ఒకే ఒక్క హీరో శ్రీకాంత్. 100 సినిమాలను పూర్తి చేశాక తన బాధ్యత మరింత పెరిగిందని అంటున్నాడు శ్రీకాంత్.


ఇక ఈమధ్య హీరోగా కెరియర్ అంత శాటిస్ఫైడ్ గా లేదన్నది వాస్తవం. అందుకే జగపతి బాబులాగా ఆయన కూడా విలన్ గా ట్రై చేశారు. నాగ చైతన్య చేసిన యుద్ధం శరణం సినిమాలో శ్రీకాంత్ విలన్ గా ప్రయత్నించారు. కాని ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విలన్ గా శ్రీకాంత్ లుక్, పర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకున్నా సినిమాలో అంత కంటెంట్ లేకపోయే సరికి శ్రీకాంత్ సక్సెస్ అవలేదు.


లెజెండ్ సినిమాలో జగపతి బాబు అదరగొట్టాడు. అందుకే జగ్గు భాయ్ విలన్ గా బాగా సెట్ అయ్యాడు. లెజెండ్ తర్వాత విలన్ గా జెబి సూపర్ ఫాంలోకి వచ్చారు. శ్రీకాంత్ కూడా యుద్ధం శరణం సినిమాతో కాకుండా వేరే స్టార్ హీరో సినిమాలో విలన్ గా చేసి ఉంటే తప్పకుండా మంచి ఫలితం వచ్చేది.


నాగ చైతన్య సినిమా చేయడం వల్లే విలన్ గా సక్సెస్ కాలేదు. ఒకవేళ ఆ సినిమా హిట్ అయ్యుంటే తాను కూడా విలన్ గా కంటిన్యూ చేసే వాడిని అంటున్నాడు శ్రీకాంత్. మరి విలన్ ఆశలు అలానే ఉన్నా సరైన సబ్జెక్ట్ ఎంచుకోవడంలో తన టాలెంట్ చూపించాల్సి ఉంటుంది. మరి శ్రీకాంత్ ను మళ్లీ విలన్ గా మార్చే ప్రయత్నం ఏ దర్శకుడు చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: