2018 సంవత్సరం టాలీవుడ్ కు మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని చెప్పాలి. ఒక పక్క బ్లాక్ బాస్టర్ లను ఇస్తే మరో పక్క అట్టర్ ప్లాప్స్ ను కూడా ఇచ్చింది. అయితే పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన `అజ్ఞాతవాసి` చెత్త సినిమాల్లో నంబర్- 1 అని చెప్పాలి. పెద్ద బడ్జెట్ తో తెరకెక్కి ఎన్నో అంచనాల నడుమ భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాలో విషయం సున్నా అని క్రిటిక్స్ దుమ్మెత్తిపోశారు. అందుకు తగ్గట్టే వసూళ్ల పరంగా డిస్ట్రిబ్యూటర్ల కొంప ముంచండంతో లబోదిబోమన్నారు. అంత చెత్త కంటెంట్ లేకపోతే జనం ఎందుకు నిరాదరిస్తారు? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

Image result for agnathavasi

సినిమాలో అస్సలు మ్యాటర్ లేదని త్రివిక్రమ్ మ్యాజిక్ ఫెయిలైందని క్రిటిక్స్ ఓ రేంజులో విరుచుకుపడ్డారు. బాక్సాఫీస్ వద్ద సినిమా  తేలిపోయింది. అలాగే నారా రోహిత్ ప్రయోగాల బాటలో వెళుతూ నటించిన `వీర భోగ వసంత రాయలు` పెద్ద నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా సెలక్షన్ పెద్ద రాంగ్ అన్న మాట వినిపించింది. సినిమా చూసిన వాళ్లకు తల బొప్పి కట్టడంతో పెదవి విరిచేశారు. ఎన్నో కష్టాల మధ్య రిలీజైన ఈ సినిమా అసలు ఆడిందో లేదో కూడా ఎవరికీ తెలియలేదు.

Image result for amar akbar anthony

2018 ద్వితీయార్థంలో మాస్ మహారాజా రవితేజ ఏదో మ్యాజిక్ చేస్తాడనుకుంటే `అమర్ అక్బర్ ఆంటోని` ఫలితం భేజారెత్తించింది. శ్రీనువైట్ల తనకు ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో ఇప్పుడు మాస్ రాజాతో పాటు శ్రీనూ కూడా పూర్తిగా సంక్షోభంలో పడిపోవాల్సొచ్చింది. గొప్ప సినిమాలు తీసిన మైత్రి మూవీస్ కి చెడ్డ పేరు తెచ్చినవాళ్లయ్యారు. కింగ్ నాగార్జున దేవదాస్ లాంటి క్లాసిక్ సినిమాలో నటించారు. సేమ్ ఏడాది `ఆఫీసర్` లాంటి చెత్త సినిమాలోనూ నటించారు. స్నేహితుడు ఆర్జీవీకి సాయం చేయబోయి చేసిన సాహసం కాస్తా బెడిసికొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: