టాలీవుడ్, కోలీవుడ్ అందాల భామ నయనతార అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘చంద్రముఖి’ సినిమాలో అమాయకంగా నటించిన నయనతార..తర్వాత గ్లామర్ తరహా పాత్రల్లో కనిపించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  దక్షిణాది సినీ తారల్లో నయనతారనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.  ఈ మద్య లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్న నయనతార సినీ జీవితం ఎంత అందంగా ఉన్నా..పర్సనల్ లైఫ్ మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి. 
Vignesh Shivan and Nayanthara Christmas Celebration
మొదట తమిళ హీరో శింబుతో రోమాన్స్ చేసి కొంత కాలం తర్వాత విడిపోయింది.  ఆ తర్వాత నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవతో ఏకంగా పెళ్లివరకు వచ్చినా..చివర్లో బెడిసి కొట్టింది.  ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివ‌న్  తో సహజీవనం చేస్తుంది.  త్వరలో వీరిద్దరూ పెళ్లికూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  ప‌లు కార్య‌క్ర‌మాల‌లో క‌లిసి క‌నిపించే ఈ జంట విదేశాల‌లోను చ‌క్క‌ర్లు కొడుతూ, అక్క‌డ దిగిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తున్నారు. 

తాజాగా వీరిద్ధ‌రు క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు. అంద‌రికి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. తాము దిగిన సెల్ఫీల‌ని షేర్ చేసారు.  త్వ‌ర‌లో విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌నుంది ఈ లేడీ సూప‌ర్ స్టార్‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి ఇద‌యం మురళి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.  అంతే కాదు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: