రాజమౌళి లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ కి సంబంధించి ఇప్పటికే చాలా పుకార్లు బయటికి వచ్చాయి . అయితే ఈ మూవీ ఏ జానర్ అనే సస్పెన్స్ ఇప్పటికీ పూర్తిగా తొలగలేదు. బ్యాక్ డ్రాప్ గురించి ఇంతకుముందు రకరకాల వార్తలు వచ్చాయి కాని వేటికీ ఆధారాలు లేవు. ఒక పక్క రాజమౌళి కార్తికేయ పెళ్లి.తో మరోవైపు చరణ్ వినయ విధేయ రామ ప్రమోషన్స్ తో పాటు చివరి పాట షూటింగ్ లో బిజీగా ఉండటంతో రెండు రకాలుగా కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్యాప్ సబబుగానే చెప్పొచ్చు.

Image result for rajamouli multi starrer

ఇకపోతే మరో ఆసక్తిరమైన అప్ డేట్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇది స్వతంత్రం రాక ముందు నేపధ్యంలో 1930లో మొదలై ఇప్పటి వర్తమానం దాకా సాగుతుందట. అంటే 2020 వరకు. మొత్తం తొంబై ఏళ్ళ కాలాన్ని రెండు జన్మల థీమ్ మీద రాజమౌళి రాసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఇలాంటి లైన్ మరీ కొత్తదేమీ కాదు. బాలీవుడ్ లో అప్పుడెప్పుడో 90 దశకంలో సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ హీరోలుగా కరణ్ అర్జున్ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది.

Image result for rajamouli multi starrer

అదీ ఇలాగే ఇద్దరు అన్నదమ్ములు ఒక జన్మలో విలన్ చేతిలో చనిపోతే మరో జన్మలో వేర్వేరు చోట పుట్టి తర్వాత కలిసి ప్రతీకారం తీర్చుకుంటారు. మగధీరలో ఇది లవ్ స్టొరీకి లింక్ అయ్యి ఉంటుంది. ఇలా పునర్జన్మ అనే కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా ఎవరి స్టైల్ లో వాళ్ళు ప్రెజెంట్ చేయడం మూలంగా మంచి హిట్స్ దక్కాయి. అయితే ఆర్ఆర్ఆర్ లో చరణ్ తారక్ స్నేహితులుగా కనిపిస్తారట. మరి రెండు జన్మల పాయింట్ నిజమో కాదో కాని ఫైనల్ గా ఎలాంటి లైన్ తో అయినా మేజిక్ చేయగలిగే రాజమౌళి ఏ మంత్రజాలంతో మెప్పిస్తాడో ప్రత్యేకంగా చెప్పాలా

మరింత సమాచారం తెలుసుకోండి: