ఈ మద్య సెలబ్రెటీలు నోరు జారి ఏది మాట్లాడినా..అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించినా..సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడయాలో ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ వివాదం చక్కర్లు కొడుతుంది.  తమ్మారెడ్డి భరద్వాజ తరచుగా సినీ రాజకీయ, సామజిక అంశాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతుండడం చూస్తూనే ఉన్నాం. తమ్మారెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 
నన్నుప్రశ్నిస్తే
తనకూ, మెగాస్టార్ చిరంజీవికి మధ్య విభేదాలున్నాయంటూ యూట్యూబ్‌లో ప్రచారమవుతున్న విషయమై తాజాగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని.. తాను ఓ సామాన్యుడినంటూ వివరించారు. ఎవరినైనా నేను ఎందుకు కెలుకుతాను. చిరంజీవిని కెలికాను అంటూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలో వైరల్ అవుతున్నాయి. హెడ్డింగులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు.
Related image
అసలు నేను చిరుని ఎప్పుడు కెలికానండీ అంటూ తమ్మారెడ్డి మండిపడ్డారు. సాధారణంగా తనను ఏ హీరో గురించి అయినా అడిగితే వాళ్ల గురించి మాట్లాడుతాను..వాళ్లందరితో నాకున్న చనువు వలనే కొన్ని విషయాలు బాహాటంగా మాట్లాడుతుంటానని అన్నారు. నాకు ఇండస్ట్రీలో ఎవ్వరితోనూ విభేదాలు లేవని తమ్మారెడ్డి అన్నారు.  తాను కూడా ఒక సామాన్యుడిగానే ఉంటానని..ఆ కోణంలోనే సినీ ఇండస్ట్రీని చూస్తానని..తనకు ఎవరితోనూ విభేదాలు కొనసాగించాల్సిన అవసరం లేదని అన్నారు. మ్మారెడ్డి చెబుతున్న విషయాలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడమే కాదు కొందరు ట్రోల్ కూడా చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: