డార్లింగ్ అంటూ అంతా ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజులా రెబెల్ స్టార్.  ఆయన్ని హీరోగా పెట్టి యాక్షం మూవీసే ఎక్కువగా తీశారు. దాంతో ప్రభాస్ లోని లవ్ అలాగే ఉండిపోయింది. నిజానికి తొలి చిత్రం ఈశ్వర్ లో ప్రభాస్ ప్రేమికుడే. మధ్యలో వచ్చిన  డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంట్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయిన ప్రభాస్ తరువాత మళ్ళీ కత్తులూ,  కటార్లు పట్టుకున్నారు. 


ప్రేమకధా చిత్రం :


ఇదిలా ఉండగా సాహో తరువాత ప్రభాస్ నటించే మూవీ కోసం ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ 1960ల నాటి ప్రేమికుడిగా కనిపిస్తారట. ధనవంతుడైన కార్ల వ్యాపారిగా ఉంటూ విలాసవంతమైన జీవితం గడిపే ప్లే బాయ్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నారట. ఇందులో ఆయన ఓ పేద యువతిని ప్రేమిస్తారని, వారిద్దరి మధ్య ఎర్లీ సిక్సిటీస్ నాటి  రొమాన్స్ సూపర్ గా ఉంటుందని టాక్ బయటకు వస్తోంది. ఈ మూవీలో ఆ పేదింటి యువతిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ మూవీ కోసం ప్రభాస్ తన బరువుని కూడా తగ్గించుకుంటున్నారట.


రాధాక్రిష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు నిర్మాణ భాగస్వామిగా తెరకెక్కిస్తున్నారు. 2018లో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా అభిమానులకు నిరాశ కలిగించిన ప్రభాస్ 2019కి మాత్రం అటు సాహోతో పాటు ఇటు ఈ లవ్లీ మూవీని కూడా కానుకగా అందించనున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రేమికుడి పాత్ర, అదీ ఓల్డ్ ట్రెండ్ లో ఉండడం అన్న న్యూస్ ఫ్యాన్స్ కి కిక్కేక్కిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: