తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువ సినిమా లు మెగా ఫామిలీ నుంచే వస్తాయని చెప్పడం లో ఎటువంటి డౌట్ లేదు. అయితే 2018 సంవత్సరం మెగా ఫ్యామిలీ కి హిట్స్ కంటే ప్లాప్స్ నే మిగిల్చిందని చెప్పాలి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` ఇండస్ట్రీలో రికార్డుల్ని తిరగరాస్తూ అద్భుత విజయం సాధించింది. దాంతో పాటు వరుణ్ తేజ్ `తొలి ప్రేమ` హిట్టు కొట్టింది. ఆ ఇద్దరూ మెగా కాంపౌండ్ కి రిలీఫ్ అనుకుంటే.. ఇతర మెగా హీరోలంతా ప్లాపుల బాట పట్టడం తీవ్రంగానే నిరాశపరిచింది.

Image result for mega family

 అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `అజ్ఞాతవాసి` చిత్రం డిజాస్టర్ ఫలితం అందుకుంది. ఈ సినిమా నిరాశపరిచాక మరో సినిమా మాట ఎత్తకుండా పవన్ పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు.ఇతర మెగా హీరోల్ని పరిశీలిస్తే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `నా పేరు సూర్య` చిత్రంతో డిజాస్టర్ రిజల్ట్ అందుకున్నాడు. తానొకటి తలిస్తే అన్నచందంగా అవ్వడంతో బన్ని చాలానే నిరాశపడ్డాడు. ఎనర్జిటిక్ హీరో సాయిధరమ్ కెరీర్ రెండు  డిజాస్టర్లతో డీలా పడిపోయింది. వినాయక్ దర్శకత్వంలోని ఇంటెలిజెంట్ - కరుణాకరణ్ దర్శకత్వం వహించిన `తేజ్.. ఐ లవ్ యు`  చిత్రాలు డిజాస్టర్లయ్యాయి. దీంతో సాయిధరమ్ తీవ్రంగా నిరాశపడ్డాడు. అల్లు శిరీష్ కి సినిమాలేవీ లేవు.


ఓన్లీ `ఏబీసీడీ` డబ్బింగ్ రిలీజ్ తప్ప స్ట్రెయిట్ తెలుగు సినిమా ఏదీ రాలేదు. నాగబాబు కుమారుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక హిట్టు - ఒక ఫ్లాపుతో ఓకే అనిపించాడు. ప్రథమార్థంలో వరుణ్ తేజ్ నటించిన `తొలి ప్రేమ` రిలీజై హిట్ కొట్టింది. ఏడాది ద్వితీయార్థం ముగింపులో రిలీజైన `అంతరిక్షం` నిరాశపరిచింది. టాలీవుడ్ లో ప్రయోగాల హీరోగా వరుణ్ తేజ్ కి గుర్తింపు అయితే దక్కింది. మెగా ప్రిన్సెస్ నీహారిక ఫ్లాప్ షోపైనా ఆసక్తికర చర్చ సాగింది. నిహారిక నటించిన `హ్యాపీ వెడ్డింగ్` ఫ్లాప్ గా నిలవడం నిరాశపరిచింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ సినిమా `విజేత` అపజయం ఎదుర్కొంది. తప్పులు చేయడం సహజం. కానీ ఈ అపజయాల నుంచి మెగా హీరోలు గుణపాఠం నేర్చుకుని 2019లో సరైన ప్రణాళికలతో దూసుకెళతారనే భావిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: