ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న బయోపిక్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ నట విశ్వరూపం చూపించాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా రిలీజ్ కాబోతుంది.


ఎన్.టి.ఆర్ కథానాయకుడు జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ అవనుంది. ఎన్.టి.ఆర్ బాల్యం, సిని రంగ ప్రవేశం ఈ సినిమాలో చూపించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ 60 గెటప్పులలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ కథానాయకుడు బిజినెస్ లో దుమ్ముదులిపేస్తుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ లో మంచి డిమాండ్ ఏర్పడిందట.


కథానాయకుడు డిజిటల్ రైట్స్ అమేజాన్ ప్రైం ఏకంగా పాతిక కోట్లు పెట్టి కొనేశారట. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచగా కథానాయకుడు బిజినెస్ లో అదరగొడుతున్నాడు. ఇక శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ ఇంకా అమ్ముడవ్వాల్సి ఉంది. ఎలా లేదన్నా రెండు పార్టులకు పెట్టిన బడ్జెట్ మొదటి పార్ట్ తోనే రాబట్టేస్తున్నారు ఎన్.టి.ఆర్ దర్శక నిర్మాతలు.


మొదటి పార్ట్ రిజల్ట్ ను బట్టి సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేయొచ్చు. ఈ సినిమా బాధ్యత మీద వేసుకున్న క్రిష్ సినిమాను ఎంతో గొప్పగా డైరెక్ట్ చేశాడని ట్రైలర్, సాంగ్స్ వింటేనే తెలుస్తుంది. మరి ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర ఎలా ఉంటుందో చూడాలి. సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన బాలకృష్ణ బయోపిక్ పై మరింత అంచనాలు పెంచుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: