యాంకర్ కం యాక్టర్ రష్మీ గౌతం వెండితెరతో పాటు బుల్లి తెర మీద తనదైన అభినయాన్ని చూపిస్తూ రాణిస్తోంది. రష్మీకి జబదస్త్ మంచి పేరు తెచ్చిపెడితే ఆ మధ్యన వచ్చిన గుంటూర్ టాకీస్ అసలు ఘాటు ఏంటో చెప్పింది. ఆ తరువాత సినిమాలు చేసినా కూడా రష్మీకి విజయాలు అంతగా దక్కలేదు. కానీ గ్లామర్ విషయంలో మాత్రం మంచి మార్కులే వేసుకుంది. రష్మీ బోల్డ్ నెస్ కి మారు పేరు అంటారు.


దానికి తగినట్లుగా ఆమె ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నకు రష్మి ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ బోల్డ్ నెస్ ని మరో మారు బయటపెట్టింది.  మీ పెళ్లి లవ్వా, అరేంజ్డ్ మ్యారేజా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. సహజీవనం అనే ఆప్షన్ వుందిగా అంటూ తనదైన శైలిలో సమాధానం రష్మి సమాధానం ఇచ్చి ఖంగు తినిపించింది. బాబోయ్ రష్మి మరీ అంత బోల్డ్ గానా అనిపించేసింది.


అంతే కాదు, జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్.. ప్రదీప్ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని వస్తే ఎవరిని  చేసుకుంటారనే ప్రశ్న యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఎదురైంది. ఇందుకు ఆమె ఏం చెప్పిందంటే.. తన వర్క్ వేరు, వ్యక్తిగతం వేరని చెప్పింది. రెండూ వేరు వేరుగా వుంటాయి. ఇందులో వుండే వ్యక్తులు అందులోకి రారు. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రారని తెలివిగా జవాబు ఇచ్చింది. 


తనకు పెళ్లి గురించి అడిగే ప్రశ్నలు నచ్చవని రష్మీ చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే తాను ఓ బిడ్డను దత్తత తీసుకుంటానని రష్మీ చెప్పుకొచ్చింది. మొత్తానికి రష్మికి అందమే కాదు.తెలివి తేటలు బాగానే ఉన్నాయి. ఎంత బోల్డ్ గా ఉన్నా తన హద్దులు తనకు తెలుసని కూడా గడుసుగా చెబుతున్న ఈ సెన్సేషనల్ యాంకర్ కం యాక్టర్ మాటలతోనూ మనసు దోచేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: